Search This Blog

Friday, March 28, 2025

క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ?? దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

 

క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ?? దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

విటమిన్ సి వృద్ధాప్యం, ముడుతలతో సంబంధం ఉన్న ఫ్రీరాడికల్ చర్యను నిరోధిస్తే, బీటా కెరోటిన్ చర్మ మంటను నివారిస్తుంది. అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉండటం వలన పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. వృద్ధాప్యఛాయలను దరిచేరనివ్వదు. దీన్ని సమ్మర్‌లో రెగ్యులర్ గా తాగితే ఇంకా మంచిదంటున్నారు. వేసవి సమయంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మినరల్స్ అధికంగా ఉండే ఆహారాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆహారాలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎండాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకు క్యారెట్ రసం బాగా ఉపయోగపడుతుంది. సీజన్ మారుతున్న ఈ సమయంలో రకరకాల వ్యాధులు దాడిచేస్తాయి. ఈ సమయంలో రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారికి క్యారెట్‌-బీట్‌రూట్‌ జ్యూస్‌ బాగా పనిచేస్తుంది. క్యారెట్లో విటమిన్లు ఎ, బి, ఇ, కాల్షియం, ఫైబర్ ప్రోటీన్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. బీట్‌రూట్‌లో ఇనుము, సోడియం, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇది సహజ చక్కెరలకు మంచి మూలం. ఈ రెండు కూరగాయల రసాన్ని మిక్స్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. బీట్‌రూట్‌-క్యారెట్ జ్యూస్‌లో తక్కువ కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ త్వరగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేసవిలో చాలా మంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top