అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? తిన్నాక ఈ డ్రింక్స్ తాగితే ఈజీగా వెయిట్‌లాస్! - Weight Loss Homemade Drinks

Weight Loss Drinks After Meal : ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు అధిక బరువే కారణమంటే మీరు కాదనగలరా. బరువు నియంత్రణలో ఉంటేనే శరీరంలోని చాలా పనులు సాఫీగా జరుగుతాయి. మెటబాలిజం కూడా వృద్ధి చెంది నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ప్రస్తుతం అధిక బరువు సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వ్యాయామాలు, వాకింగ్ లాంటి శారీరక శ్రమతో పాటు కొన్ని రకాల పానీయాలు కూడా సహకరిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఈ ఐదు డ్రింకులు తీసుకుంటే మీ బరువు తగ్గడమే కాదు చక్కటి ఆరోగ్య వ్యవస్థ మీ సొంతం అవుతుంది.
తులసి ఆకుల టీ
శరీర బరువును తగ్గించేందుకు తులసి ఆకుల టీ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే గుణాలు అజీర్ణాన్ని దూరం చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహకరిస్తుంది. అందుకే భోజనం చేసిన తర్వాత ఈ టీ తాగితే అరుగుదల బాగుండి బరువు పెరగకుండా ఉంటారు.
సోంపు గింజల టీ
తిన్న తర్వాత సోంపు తింటే అరుగుదల బాగుంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే తిన్న తర్వాత వీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా అదే ఫలితం వస్తుంది. సోపు గింజలు కడుపు ఉబ్బరాన్ని తగ్గించి ఆహారం జీర్ణం అవ్వడానికి దోహదపడే కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడం, బరువు నియంత్రణలో ఉంటుంది.
అల్లం టీ
అన్నం తిన్న తర్వాత అల్లం టీ తీసుకుంటే కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు దూరమవుతాయి. మెటబాలిజాన్ని వృద్ధిచేసి హానికరమైన కొవ్వులను కరిగించడం, బరువు తగ్గేందుకు అల్లం టీ బాగా సహాయపడుతుంది.
గ్రీన్ టీ
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. బరువు తగ్గే ప్రక్రియకు ఇవి చాలా అవసరం. అంతేకాకుండా వీటిలోని కేటాచిన్ మెటబాలిజాన్ని బూస్ట్ చేసి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.