Search This Blog

Thursday, January 9, 2025

SUFFIX – PREFIX పై వివరణ

 🔖 *SUFFIX – PREFIX పై వివరణ*


✴️ *15రోజులు మించిన సెలవు కాలాన్ని -వెకేషన్ అంటారు.*


*15 రోజుల లోపు సెలవులను- మిడ్ టర్మ్ హాలిడేస్ అంటారు.*


👉 *10 రోజులకు పైబడి 15 రోజులకు మించని మిడ్ టర్మ్ సెలవుల సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున ,తెరిచే రోజున తప్పక హాజరు కావాలి.*


*(Rc .No.10324/E4-2/69,Dt :7-11-1969)*


👉 *మిడ్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల లోపు ఉన్న సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున లేదా తెరిచే రోజున గైర్హాజరు అయిన సంధర్భం లో  సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.*


👉 *మిడ్ టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సంధర్భం లో పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు EL మంజూరుకు అవకాశం కలదు.*


*(Rc.No.815/E1/99 Dt : 1-9-1999)*


*సంక్రాంతి సెలవుల వివరణ:-*


*ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు జనవరి 13 నుండి 17 వరకు అనగా 5 రోజులుగా నిర్ణయించారు. (అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం )*


*యధావిధిగా 11,12 – రెండవ శనివారం,ఆదివారం సెలవులే.*


*కావున పాఠశాల చివరి లేదా తెరిచే రోజున గైర్హాజరు అయిన సంధర్భం లో  సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.*


*మరియొక వివరణ:-*


*📡అసలు ప్రిఫిక్స్ అంటే,సఫిక్స్ అంటే వివరంగా తెలుసుకుందాం*.✍️


👉 *15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.*


👉 *15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు*


👉 *వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.*


👉 *షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.*


👉 *షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.మొత్తం 10రోజులు మించకుండా రెండు వైపులా CL లు పెట్టుకోవచ్చు.*


*👉వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.(వర్తించదు)*


*కాబట్టిసంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.*


*👉C&DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999 ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.*


*👉చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును. ( CLమరియు CCL కాకుండా).*


*✅ సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ, 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.*


*హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి(HPL/ML/EL/EOL)*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top