Search This Blog

Sunday, January 26, 2025

మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!

 


మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!

formula_for_finding_weight


3 Min Read

Formula for finding weight : సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి సినిమాలో బ్రహ్మానందాన్ని ఉద్దేశించి 'నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి' అని అలీ చెప్పే ఈ డైలాగ్ చాలా ఫేమస్. కొంత మంది ఎత్తు తక్కువగా, బరువు ఎక్కువగా ఉండి చూసేందుకు డ్రమ్ములా కనిపిస్తారు. మరికొందరు ఎత్తు ఎక్కువగా బక్క పలుచగా కొబ్బరిచెట్టును తలపిస్తుంటారు. అసలు ఎత్తుకు బరువుకు సంబంధం ఉందా? అని ప్రశ్నిస్తే అవును అనే సమాధానమే వస్తోంది. మంది అధిక బరువుతో బాధపడుతుంటే, మరి కొంత మంది తక్కువ బరువున్నామని, పెరిగేందుకు ట్రై చేస్తుంటారు. అసలు ఎవరెవరు ఎంత బరువు ఉండాలో కొన్ని లెక్కలున్నాయి.

జంక్ ఫుడ్ కారణంగా ఎంతో మంది అధిక బరువు (ఒబేసిటి) సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకునేందుకు డైట్ ఫాలో అవుతుంటారు. వ్యాయామం, సైక్లింగ్ తో పాటు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవానికి ఏ వయసు వారు ఎంత బరువు ఉండాలి అనేదానికి వైద్య శాస్త్రంలో కచ్చితమైన నియమం ఉంది. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే బరువును నియంత్రించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే లెక్క. బరువు తెలుసుకోడానికి వైద్య శాస్త్రంలో బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సూత్రం ఉంది. దీని ఆధారంగా ఎత్తుకు తగ్గ బరువును తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి శరీరం, ఎత్తు, బరువు వేర్వేరుగా ఉంటాయి. సరైన వయస్సులో బరువును నియంత్రించుకోకపోతే, అది భవిష్యత్తులో వ్యాధులకు మూలం అవుతుంది.

ఉదాహరణకు ఐదు అడుగుల ఎత్తున్న వ్యక్తి బరువు 60 కిలోలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి BMI 25.54 అవుతుంది. దీన్ని ఈ ఫార్ములాలో సెట్ చేయడానికి, ముందుగా ఎత్తును మీటర్లుగా మార్చండి. 5 అడుగుల ఎత్తు అంటే వ్యక్తి ఎత్తు 1.53 మీటర్లు. ఇప్పుడు మనం 1.53 మీటర్లను 1.53 మీటర్లతో గుణిస్తాము. ఇది 2.35 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు 60 కిలోల బరువును 2.35తో భాగించండి. దీని తర్వాత మిగిలినవి 25.54 అవుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి BMI లెక్కిస్తారు. సాధారణంగా, 25 BMI అనేది ఎత్తుకు తగిన బరువుగా పరిగణిస్తారు. అయితే 5 అడుగుల పొడవున్న వ్యక్తి 60 కిలోల బరువు ఉంటే అధికంగా బరువు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.

బీఎంఐ ఛార్ట్
బీఎంఐ ఛార్ట్ (ETV Bharat)

BMI అంటే :

ఒకరి BMI 18.5 నుంచి 24.9 మధ్య ఉంటే అది సరైన బరువు. కానీ ఎవరికైనా BMI 18.5 కంటే తక్కువ ఉంటే, అతను తక్కువ బరువుతో ఉంటాడు, BMI 25 నుంచి 29.9 మధ్య ఉంటే, అతను అధిక బరువుతో ఉంటాడు. అదే సమయంలో, ఎవరైనా BMI 30 కంటే ఎక్కువ ఉంటే, అతను ఊబకాయంతో బాధపడుతున్నాడని అర్థం.

బరువును ఇలా కొలవాలి :

ఖాళీ కడుపుతో మీ శరీర బరువును కొలవడానికి ప్రయత్నించాలి. రోజూ కాకుండా కనీసం వారానికి ఒకసారి పరిశీలించుకుంటే పరిస్థితిలో తేడా సులభంగా గమనించవచ్చు. అంతే కాకుండా నెలనెలా ఎంత బరువు తగ్గుతున్నారో, పెరుగుతున్నారో కూడా తెలుస్తుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top