Search This Blog

Monday, January 20, 2025

34 ఏళ్లకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భావోద్వేగ సన్నివేశాలు

 

Hyderabad: 34 ఏళ్లకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భావోద్వేగ సన్నివేశాలు

చౌటుప్పల్ ఉన్నత పాఠశాల1990-91 సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. యోగ క్షేమాలను అడిగి తెలుసుకొని.. చిన్నానాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు.

Hyderabad: 34 ఏళ్లకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భావోద్వేగ సన్నివేశాలు
Get To Gether

అనాటి అనుభూతులు మధురం…స్నేహపు మధురానుభవాలు మధురం. ..ఈ కలయిక మధురం.. అంటూ చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1990-91 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు గెట్ టూ గెదర్ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దాదాపు 34 సంవత్సరాల కలిసిన ఈ ఆత్మీయ వేడకలో బావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఈ సందర్భంగా అందరూ నాటి-నేటి సంగతుల్ని పంచుకున్నారు. గాఢంగా అల్లుకున్న స్నేహబంధాన్ని పంచుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు. తాము ఈ స్థానంలో ఉన్నామంటే గురువుల పుణ్యమే అని చెప్పుకొచ్చారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని కార్యక్రమానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు.. ఇలా వివిధ రంగాల్లో స్థిరపడిన 90 మందికి పైగా విద్యార్థులు ఈ ఆత్మీయం సమ్మేళనంలో పాల్గొన్నారు. సంస్కారం, చదువు ఇచ్చిన ఈ స్కూల్‌ను ఎన్నిటికి మరువమన్నారు. ఎన్నో ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. అందరూ చక్కటి సాయంత్రాన్ని గడిపారు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top