ఇటీవలి కాలంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టమున్నా తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సహజ రుచితో ఆరోగ్యాన్ని పంచే బెల్లం తింటే మంచిదా? కాదా? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. మరి, మధుమేహానికి.. బెల్లం ఎలా పనిచేస్తుంది..
ఇటీవలి కాలంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టమున్నా తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు అందుబాటులో ఉన్నా పరిమితంగానే తీసుకుంటే మంచిదని చెబుతుంటారు ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో సహజ రుచితో ఆరోగ్యాన్ని పంచే బెల్లం తింటే మంచిదా? కాదా? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే, డయాబెటిక్ పేషెంట్లు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. తీపి పదార్థాలు తినే విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించినా రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరిగిపోయే అవకాశముంది.
భారతీయులు సంప్రదాయ వంటకాల్లో బెల్లాన్ని విరివిగా వాడుతుంటారు. చెరకు రసం లేదా తాటి రసం నుంచి తయారుచేయబడే సహజ తీపిపదార్థం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తక్కువ ప్రాసెసింగ్ విధానంలో తయారయ్యే బెల్లంలో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, తెల్ల చక్కెర కంటే ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు పోషకాహార నిపుణులు. ఎముకల దృఢత్వానికి ఉపయోగపడే క్యాల్షియం, రక్తహీనతను తగ్గించే ఇనుము, ఫాస్పరస్, మోగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీసుకున్నా మంచిదే అని అంటుంటారు కొంతమంది. అయితే, డయాబెటిక్ పేషెంట్లు బెల్లం తీసుకోవచ్చా? అనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.
1. గ్లైసెమిక్:
క్యాల్షియం, మోగ్నీషియం, ఇనుము, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉన్నప్పటికీ బెల్లంలో గ్లైసెమిక్ అధికంగా ఉంటుంది. 84-85 స్థాయిలో గ్లైసెమిక్ ఉన్న పదార్థాలు తీసుకుంటే రక్తం చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులు గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. అధిక-GI కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే హఠాత్తుగా చిక్కులు ఏర్పడవచ్చు. మధుమేహాన్ని అదుపు చేయడం కష్టమవుతుంది.
2. చక్కెరను నియంత్రించడంలో విఫలమవుతుంది:
తెల్ల చక్కెర కంటే బెల్లం తక్కువగా ప్రాసెస్ చేయబడినప్పటికీ రక్తంలో చక్కెరపై దీని ప్రభావం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఆహారంలో బెల్లం చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడవచ్చు.
3. కేలరీలు:
బెల్లంలో కేలరీలు ఎక్కువ. కాబట్టి తరచుగా తీసుకుంటే బరువు పెరగవచ్చు. అధిక బరువు లేదా ఊబకాయం మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
4. సుక్రోజ్:
బెల్లంలో ప్రధానంగా సుక్రోజ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఒక రకమైన చక్కెర. రక్తంలో చక్కెర స్థాయిని పెంచి ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు.
5. ఇన్సులిన్ నిరోధకతను బలహీనం:
బెల్లం తరచూ వినియోగిస్తే కాలక్రమేణా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. దీంతో ఇన్సులిన్ నిరోధకత మరింత దిగజారుతుంది. అప్పటికే బలహీనమైన ఇన్సులిన్ పనితీరుతో పోరాడుతున్న డయాబెటిక్ రోగులకు హానికరం కావచ్చు.