Search This Blog

Tuesday, December 31, 2024

చిన్నగా కనిపించే అవిసె గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..

 ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. డయాబెటిస్‌కు పవర్‌ఫుల్.. దెబ్బకు ఈ 3 సమస్యలు పరార్..

ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవిసె గింజలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..

ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. డయాబెటిస్‌కు పవర్‌ఫుల్.. దెబ్బకు ఈ 3 సమస్యలు పరార్..

Flaxseeds


ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే.. చిన్నగా కనిపించే అవిసె గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. అంతేకాకుండా కొవ్వును కరిగిస్తాయి.. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ధమనులలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రక్తపోటు సమస్యను తగ్గించడంలో అవిసె గింజలు కూడా మేలు చేస్తాయి.


అవిసె గింజలలో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. అంతేకాకుండా మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.


అవిసె గింజల ప్రయోజనాలు..

కొలెస్ట్రాల్..


ప్రస్తుతం చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండెపోటుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.


అవిసె గింజలను రోజూ తీసుకోవడం వల్ల ధమనులలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.. ఇంకా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


హైబీపీ..


అధిక రక్తపోటు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది.. హైబీపీ గుండెపోటుకు కూడా దారి తీస్తుంది. ఇలా రోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.


మధుమేహం..


ప్రస్తుతం చిన్నవయసులోనే మధుమేహం సమస్య వస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అవిసె గింజలతో రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. ఈ గింజలు షుగర్ లెవెల్స్ పెరగకుండా మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


అయితే.. అవిసె గింజలను పచ్చిగా నైనా లేదా వేయించి అయినా తినవచ్చు.. ఇంకా ఉదయాన్నే తింటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)


మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top