Search This Blog

Saturday, December 7, 2024

పత్రికా ప్రచురణార్థం

 *పత్రికా ప్రచురణార్థం*

********************




*గురుకుల పాఠశాలల బలోపేతానికి తోడ్పాటు నందించండి కానీ! నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులను కల్పించవద్దు.  గురుకుల జేఏసీ కేంద్ర కార్యాలయం నాగోల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో  సంఘ ముఖ్య బాధ్యులు ఇటీవల గురుకులాలపై వస్తున్నటువంటి ఆరోపణలు ఖండిస్తున్న సందర్భంగా* 


*రాజకీయ పార్టీలకు, వాటి యువజన సంఘాలకు విద్యార్థి సంఘాలకు గురుకుల జేఏసీ విజ్ఞప్తి.*


 *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో  1971 వ సంవత్సరంలో పీవీ నరసింహారావు గారి ఆలోచనల మేరకు ఏర్పాటైనటువంటి ప్రభుత్వ గురుకుల వ్యవస్థ విజయవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితులను బెరీజు వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి సమయంలో 1984 సంవత్సరాలనుండి ఎస్సీ గురుకులాలు స్థాపించబడ్డాయి.*


 *జనరల్ గురుకులాలు మరియు ఎస్సీ గురుకులాల యొక్క అభివృద్ధిని చూసి 1998 ఎస్టి గురుకులాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 300 లోపు ఉన్నటువంటి గురుకులాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 1023 గురుకులాలుగా ఏర్పాటు కావడం అనేటటువంటిది గురుకుల విద్యా వ్యవస్థ పైన మరియు అందులో పని చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం  పైన  ప్రభుత్వంకు ఉన్న నమ్మకానికి నిదర్శనం.* 


 *ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలలో చదువుతున్నటువంటి ఆరు లక్షల మంది విద్యార్థులు పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు చెందిన పేద మధ్యతరగతి వారు మాత్రమే.* 

*దురదృష్టవశాత్తు ప్రభుత్వ గురుకులాల్లో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలను రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు తమ స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూడడం పూర్తిగా ఖoడించదగిన అంశం.* 


 *ఈరోజు గురుకులాలలో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు గత 20 సంవత్సరాలుగా ఉన్నటువంటివే.* 

*ఈ అంశాలు గతంలో ఎప్పుడు జరగలేనట్టుగా కేవలం ఇప్పుడే జరుగుతున్నట్టుగా కొన్ని    రాజకీయ పార్టీలు వాడుకోవడం గురుకుల జేఏసీ పక్షాన ఖండిస్తున్నాం.*  


*గురుకులాల్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సంఘటనలు కేవలం మానవ తప్పిదాలే తప్ప వ్యవస్థపరమైనటువంటి లోపాలు కాదని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.* 

*దురదృష్టం ఏంటంటే  ఈ వ్యవస్థ పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు కూడా సమస్యను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వాన్ని, ఇందులో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాన్ని దోషులుగా చిత్రీకరించడం పూర్తిగా ఖండించదగిన అంశం.* 

 

*గురుకుల జేఏసి పక్షాన విజ్ఞప్తి గురుకులాలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా సహకరించండి. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల గురుకులాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయ,  ఉద్యోగ వర్గం క్షణక్షణం భయభ్రాంతులకు గురవుతూ పనిచేస్తున్నారు. గతంలో గురుకులాలలో ఉన్నటువంటి నియంతృత్వ పోకడల నుంచి  ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యకమైన వ్యవస్థలో పనిచేస్తున్నామనేటటువంటి  భావనలో ఉపాధ్యాయ,  ఉద్యోగ వర్గం  గురుకులాల్లో నేడు ఉన్నది.*


 *కానీ ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీల నుంచి వాటి అనుబంధ సంఘాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల 30 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నది అని గురుకుల జేఏసీ పక్షాన ప్రకటిస్తున్నాం.* 


 *గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదయినా విచారణ కు ఆదేశిస్తే 2012 నుండీ 2023  వరకు జరిగిన అన్ని అవినీతి అక్రమాలు మరియు విద్యార్ధి, ఉపాధ్యాయ, ఉద్యోగులకు జరిగిన అనేక నష్టాలలో దోషులను శిక్షించడానికి,  సాక్షాలతో సహా నిరూపించటానికి   గురుకుల జేఏసీ పక్షాన పూర్తిగా సహకరిస్తామని ప్రకటిస్తున్నాము. వెంటనే విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.* 


*ప్రస్తుత ప్రభుత్వము యొక్క చొరవ వల్ల పారదర్శకంగా జరిగినటువంటి విధానం వల్ల 9,000 కు పైగా నూతన నియామకాలు, మూడు వేలకు మందికి పైగా ప్రమోషన్స్, 4000 మందికి  బదిలీలు  జరిగి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు సంతోషంతో ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయడానికి రెట్టింపు ఉత్సాహంతో పని చేయుచున్నారు.*   


 

*గత 8 సంవత్సరాలుగా పెరగని మెస్ చార్జెస్ వల్ల విద్యార్థులు అందిస్తున్నటువంటి డైట్ లో నాణ్యత లోపిస్తుందని అందువల్ల వెంటనే మిస్ చార్జీలు పెంచాలని సెప్టెంబర్ 28వ తారీకు రోజు గురుకుల చేసి పక్షాన ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించిన సందర్భంలో మొట్టమొదటి డిమాండ్ అయినటువంటి మేస్ చార్జీల పెంపుకు ప్రభుత్వం వెంటనే స్పందించి సుమారు 40 శాతం వరకు మిస్ చార్జీలు పెంచడం అనేటటువంటిది ఒక చారిత్రకమైనటువంటి అంశంగా గురుకుల జేఏసీ ప్రకటిస్తూ, పెరిగిన మెస్ ఛార్జీల వల్ల ఈరోజు గురుకులాలలో  నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నామని గురుకుల జేఏసీ పక్షాన స్పష్టంగా పేర్కొంటున్నాము.*


 

 *ఇకముందు  గురుకులాలని రాజకీయాలకు వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ గురుకుల టీచర్స్ అందరూ దైర్యంగా ఇటు వంటి చర్యలను ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.*




 *కృతజ్ఞతలతో!* 


 *మామిడి నారాయణ* 

             రాష్ట్ర అధ్యక్షులు 

 *డాక్టర్ A. మధుసూదన్* 

              జనరల్ సెక్రెటరీ 

*K. జనార్ధన్* 

           ఆర్గనైజింగ్ సెక్రెటరీ 

*అలగోని నరసింహులు గౌడ్*        రాష్ట్రఅధ్యక్షులు (sw unit) 

*S. గణేష్*

        జనరల్ సెక్రెటరీ 

*B.బిక్షం యాదవ్*

          వైస్ ప్రెసిడెంట్.


*GURUKULA  JAC*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top