ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత సంపదలు ఉన్నా అవి వేస్ట్. అయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలనుకునేవారు కొన్ని నియమాలను తూచా తప్పకుండా పాటించాలి.
ఆరోగ్యం కోసం పాటించాల్సిన రూల్ నంబర్ 1
ఈ సింపుల్ నియమాలను పెట్టుకొని క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే జీవితం ఆరోగ్యంగాను, ఆనందంగానూ ఉంటుంది మరి అవేమిటో తెలుసుకుందాం. ప్రతిరోజు తప్పనిసరిగా నడక సాగించాలి. ప్రతిరోజు 9000 అడుగులు వేసే లాగా లక్ష్యం పెట్టుకోవాలి. ఇది మన శరీర బరువును అదుపులో ఉంచటం మాత్రమే కాకుండా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ప్రధానంగా పాటించవలసిన నియమం.
తగినన్ని త్రాగునీరు, నిద్ర
ఒక రెండవది రోజుకు 8 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. దీని వలన పూర్తి శరీరం ఆరోగ్యంగాను ఉత్సాహంగాను ఉంటుంది. ఇది రెండవ నియమం. శరీరానికి తగినంత మంచినీళ్లను తాగితేనే శరీరంలోని జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. ఇక మూడవ నియమం ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. ఇది శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది.
ధ్యానం, వ్యాయామం, ఆహారం
ఇక నాలుగవ నియమం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ఆరు నిమిషాల పాటు అయినా ధ్యానం చేయాలి. అరగంట పాటు వ్యాయామం చేయాలి. దీంతో మన మెదడు, శరీరం ఉత్సాహంగా ఉంటాయి. ఇక ఐదవ నియమం మన ఆహారం పైన కూడా శ్రద్ధ పెట్టాలి. సీజన్ కు తగ్గట్టు సీజనల్ పండ్లు తినాలి. ప్రతిరోజు ఆహారంలో కనీసం ఐదు రకాల తాజా పండ్లు ఉండేలా చూసుకోవాలి.
ఇలా చేస్తే ఆరోగ్యమే కాదు ఆనందం కూడా
ఆరవ నియమం విషయానికి వస్తే రోజులో కనీసం నాలుగు సార్లు అయినా మన కళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. ప్రతిసారి పది నిమిషాల పాటు కళ్ళను మూసి ఉంచి వాటికి విశ్రాంతిని ఇస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఏడవ నియమం ఉద్యోగం చేయడానికి తొమ్మిది గంటలు కేటాయించినా, క్వాలిటీ సమయాన్ని వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి కేటాయించాలి. కుటుంబంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.
క్రమబద్ధమైన జీవన విధానం.. ఆరోగ్య రహస్యం
ఎనిమిదవ నియమం విషయానికి వస్తే ప్రతిరోజు ఒక గంటను పుస్తకాలు చదవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వినియోగించాలి. ఇలా చేస్తే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇక అన్నిటికంటే చివరి నియమం తొమ్మిదవ నియమం ఏదైనా సరే పని చేయాలంటే లక్ష్యం పెట్టుకొని దాన్ని చేరుకోవడానికి ప్లాన్ చేయాలి. సరైన ప్రణాళికతో ఆ పనిని సాధించడానికి ప్రయత్నించాలి. ఇలా ఎవరైతే జీవితాన్ని ఒక క్రమబద్ధమైన విధానంలో నడిపిస్తారో వారు తప్పనిసరిగా ఆరోగ్యంగానూ సంతోషంగానూ జీవిస్తారు.