స్కూల్లో ఉపాధ్యాయులు వేసిన శిక్షలు - వాటికి అర్ధాలు:-
1. మోకాళ్ళమీద కూర్చోబెడితే - వినయంగా ఉండాలని.
2. నోటిమీద వేలు వేసుకోమంటే - నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని.
3. చెవులుపట్టుకోమంటే - శ్రద్ధగా వినమని.
4. బెంచీ ఎక్కి నిలబడమంటే - నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని.
5. చేతులెత్తి నిలబడమంటే - నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.
6. గోడవైపు చూస్తూ నిలబడమంటే - ఆత్మ పరిశీలన చేసుకోమని.
7. తరగతి గది బయట నిలబెడితే - పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని.
8. బ్లాక్ బోర్డ్ తుడవమంటే - తప్పులు సరిచేసుకోమని.
9. ఏదైన విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే - గెలిచే వరకూ పోరాడమని.