Search This Blog

Sunday, September 22, 2024

Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. రోజూ ఉదయాన్నే ఈ పని చేయండి..!

Health tips | నోటి దుర్వాసన కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు దూరంగా ఉండి మట్లాడుతారు. ఇది మీకు అవమానంగా అనిపిస్తుంది. మరి ఇలాంటి సమస్య ఉండకూడదంటే మీరు కొన్ని చిట్కాలు పాటించాలి. దాంతో నోటి దుర్వాసన సమస్య నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు.

FacebookTwitterwhatsapplinkedintelegram

Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. రోజూ ఉదయాన్నే ఈ పని చేయండి..!

Health tips : మీరు ఎంత శుభ్రత పాటించినా, రోజూ ఉదయాన్నే శుభ్రంగా బ్రష్ చేసుకుంటున్నా నోటి నుంచి దుర్వాసన వస్తున్నదా..? ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. చాలా మందిని వేధిస్తున్నది. మీ నోటి దుర్వాసన కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు దూరంగా ఉండి మట్లాడుతారు. ఇది మీకు అవమానంగా అనిపిస్తుంది. మరి ఇలాంటి సమస్య ఉండకూడదంటే మీరు కొన్ని చిట్కాలు పాటించాలి. దాంతో నోటి దుర్వాసన సమస్య నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు.

చిట్కాలు

పుష్కలంగా నీళ్లు తాగాలి

నోటి దుర్వాసన సమస్య వేధిస్తున్నట్లయితే ఆ సమస్య పరిష్కారం కోసం రోజూ పుష్కలంగా నీళ్లు త్రాగాలి. నీళ్లు ఎక్కువగా తాగి మూత్ర విసర్జన చేస్తుండటం ద్వారా కడుపులోని మలినాలు తొలగిపోతాయి. దాంతో నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

లవంగం నమలాలి

ఉదయం బ్రష్‌ చేయగానే ఒక గ్లాస్‌ నీళ్లు తాగాలి. ఆ తర్వాత ఒక లవంగం నోట్లో వేసుకుని నమలాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటి దుర్వాసన దూరమవుతుంది. అంతేకాదు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

కొబ్బరి నూనె వాడాలి

నోటి దుర్వాసనను పోగొట్టడంలో కొబ్బరి నూనె కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే నోట్లో కొద్దిగా కొబ్బరి నూనె పోసుకుని, కాసేపు పుక్కిలిపట్టి ఆ తర్వాత నోరు కడిగేసుకోండి. ఇలా చేయడంవల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది.

మస్టర్డ్ ఆయిల్‌తో మర్దన

ఆవనూనెలో ఉప్పు కలిపి వేళ్లతో చిగుళ్లను బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేగాక మీ దంతాలు కూడా మిలమిలా మెరుస్తాయి.

పుదీనా ఆకులు

అదేవిధంగా రోజులో ఎప్పుడైనా వీలు చేసుకుని పుదీనా ఆకులను నమలండి. పుదీనా నమలడం ద్వారా కూడా నోట్లో నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. పైగా ఇది నోటిని చల్లగా కూడా ఉంచుతుంది.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top