Search This Blog

Sunday, September 29, 2024

టీఎస్ యుటిఎఫ్ మరియు గురుకుల జేఏసీ సంయుక్త కార్యాచరణ పిలుపుమేరకు దశల వారి ఆందోళన చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉపాధ్యాయ వర్గం సిద్ధం కావాలని పిలుపు.



































***********************
టీఎస్ యుటిఎఫ్ మరియు గురుకుల జేఏసీ 
సంయుక్త కార్యాచరణ పిలుపుమేరకు దశల వారి ఆందోళన
 చలో హైదరాబాద్
 కార్యక్రమానికి ఉపాధ్యాయ వర్గం సిద్ధం కావాలని పిలుపు.
మిత్రులారా!
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక వెయ్యి 22 గురుకుల పాఠశాలలు ఐదు డిపార్ట్మెంట్ల పరిధిలో ఆరు సొసైటీల కింద నడుస్తున్నాయి. ఈ గురుకుల లో సుమారు 30 వేల వరకు ఉపాధ్యాయ ఉద్యోగులు, ఆరు లక్షల వరకు విద్యార్థులు ఐదవ తరగతి నుండి పీజీ వరకు విద్యను అభ్యశిస్తున్నారు.

 సుమారు 700 వరకు గురుకులాలు  అద్దె గృహాలలో, విద్యార్థులకు సౌకర్యాలు లేకుండా, స్టాఫ్ నివసించేటటువంటి క్వార్టర్స్ లేకుండా నడుస్తున్న పరిస్థితులలో గురుకులాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఆచార్యులు శక్తివంచన లేకుండా  నాణ్యమైన విద్యను అందించడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని చెప్పేది వాస్తవం.
 8 సంవత్సరాల పూర్వం పెంచినటువంటి మెస్ చార్జీలు, మంచాలు, డ్యూయెల్  డేస్కూ  లు లేనటువంటి  పరిస్థితులను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడం జరిగినది. ఆశించిన ఫలితాలు కనబడకకపోగా అన్ని గురుకులాల కలిపి కాల నిర్ణయం పట్టికను మార్పు చేస్తూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు విద్యా బోధన జరగాలని ఒక  అశాస్త్రీయ పట్టికను రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 16 ద్వారా బలవంతంగా అమలు చేస్తున్నది.
 ఈ కాల నిర్ణయ పట్టిక విషయమై రాష్ట్రంలో అటు విద్యార్థి వర్గంలో గాని, ఉపాధ్యాయ వర్గంలో గాని తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నది.
 ఇంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అనుభవిస్తున్నటువంటి అనేక సౌకర్యాలను గురుకుల ఉపాధ్యాయులకు వర్తింప చేయకుండా పూర్తి సవతి ప్రేమను చూపుతున్నది. ఎక్కడ చూసినా ప్రభుత్వ గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలను క్రోడీకరించి టీఎస్ యుటిఎఫ్ మరియు గురుకుల జేఏసీ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఈరోజు ప్రభుత్వానికి మరియు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క ప్రిన్సిపల్ సెక్రెటరీలకు దశలవారి ఆందోళన కార్యక్రమ నోటీసులు అందజేయడం జరిగినది.

 మొత్తం 24 డిమాండ్ల పైన పూర్తిస్థాయి చర్చ జరపాలని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
 
 మా ఈ దశల వారి ఆందోళన కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, యువజన మరియు ప్రజాస్థానిక సంఘాలు తమ వంతు పాత్రను పోషించి గురుకులాల సమస్యల పరిష్కరించి గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి పిలుపునిస్తున్నాం. 

కృతజ్ఞతలతో.................

 కే జంగయ్య 
 ప్రెసిడెంట్ టిఎస్ యుటిఎఫ్
 చావ రవి జనరల్ సెక్రెటరీ టిఎస్ యుటిఎఫ్

 మామిడి నారాయణ అధ్యక్షుడు గురుకుల జేఏసి 
డాక్టర్A. మధుసూదన్ 
            జనరల్ సెక్రెటరీ
 కే జనార్ధన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గురుకుల జేఏసీ 
 A.నరసింహులు గౌడ్ 
                టిగారియా ప్రెసిడెంట్
 ఎస్ గణేస్ 
           జనరల్ సెక్రెటరీ

 బి బిక్షం యాదవ్ 
             వైస్ ప్రెసిడెంట్ 
 ఏ వేదాంత చారి 
 అధ్యక్షులు ఆర్టు క్రాఫ్ట్ మ్యూజిక్.
✊✊✊✊✊✊✊



-----------------------------------------------------------------------------------------------
గురుకుల ఉపాధ్యాయ బాధితులారా.. 
    సమస్యల గురించి బాధ పడుతూ whatsapp లో messages చేస్తే సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం దొరకదు. మన కోసం మనలో ఒకరు ముందడుగు వేశారు వారి వెన్నంటి ఉండి పోరాటంలో భాగస్వమ్యులమై ముందుకు కదలాల్సిన సమయం ఇది. లేదంటే ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండి పోతం.
 * నెల గడవగానే జీతాల కోసం సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి ఇంకా ఎప్పటికీ మారదు 
*ప్రభుత్వం సెలవుల గురించి మరియు వేరే విషయం గురించి Circular ఇచ్చినప్పుడు హెడ్ ఆఫీస్ వైపు ఎదురుచూసే పరిస్థితి ఇంకా ఎప్పటికీ మారదు 
*Second Saturday సెలవు అనేది ఇక కలగానే మిగిలిపోతుంది 
*హాలిడే డ్యూటీ కి CCL అనేది ఇంకెప్పటికీ సాధించలేము.
*Night stay పేరుతో టీచర్ల తోటి నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయించే దౌర్భాగ్య స్థితి నుండి ఇంకెప్పటికీ విముక్తులం కాలేము 
*చిన్న చిన్న సమస్యలకు బాధ్యులను చేస్తూ మనల్నీ సస్పెండ్ చేసే దాని నుండి తప్పించుకోలేము.
 పోరాటం నీరుగార్చేందుకు చాలా మంది కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రలు నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎక్కడో చదివాను పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్లు తప్ప అని.
2019 లో job లో join ఐన రోజు నుండి ఏ ఒక్క union mana కోసం మన సమస్యల కోసం ముందుకు రాలేదు కానీ వారు Society లో మేము ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాం అంటున్నారు. 2018 నుండి ఈ Unions and Union leaders ఎటు పోయారు. ఇప్పుడు మనం మన కోసం TGRIEA UNION ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని పక్క దారి పట్టించి మనల్నీ మోసం చెయ్యాలి అని చూస్తున్నారు. ఒక్క సారి ఆలోచించండి సమస్య మనది పోరాటం మనది. పెన్ను - ఛాక్ పీస్ పక్కన పెడితే సమస్యల పరిష్కారం దొరకదు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఈ పోరాటంలో ముందు ఉండి పోరాటం చేయాలని వేడుకుంటున్నాను. రేపటి మహా ధర్నా కు నేను వెళ్తున్నాయి మరి మీరు?
     ఇట్లు
ఏపూరి సురేష్ 
TGT MATHEMATICS
________________________________________________________

మిత్రులకు శుభోదయం....

ఈ నెల 28 న గురుకుల సమస్యల సాధనకై హైదారాబాద్ లో మహాధర్నా కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే!!!
ఈ ధర్నాకు అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఉపాద్యాయులు తరలి రావాలి.
ఈ సమస్యలు మీదో, నాదో, ఏ ఒక్కరిదో కాదు, మనందరిది. 
ధర్నా గురించి మీ చుట్టూ ఉన్న ఉపాధ్యాయులను చైతన్యం చేయాలి. ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.  కొందరు చేస్తున్నారు కదా... మనం చేయకపోతే ఏం కాదు అన్న ధోరణి విడిచి పెట్టాలి.
అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.
ఈ పోరాటాన్ని అవకాశం గా తీసుకోవాలి.ఐక్యత ను ప్రదర్శించవలసిన సమయంలో తప్పక మన బలం ఏంటో చూపిస్తేనే మన సమస్యల నుంచి విముక్తి పొందగలం. గొప్ప మార్పులన్నీ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయం మరవద్దు. కాబట్టి మిత్రులారా.... మీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కు కార్యక్రమం గురించి అవగాహన కల్పించి ఈ మహాధర్నా    కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము....

 హక్కులకై కలబడు✊
 బాధ్యతలకై నిలబడు ✊

ఇట్లు,
 టీఎస్ యుటిఎఫ్ మరియు గురుకుల సంఘాల జేఏసీ
------------------------------------------------------------------------------------------
ఇప్పుడు గాక మరెప్పుడు
     &&&&&&&&&&&&&&&&

గౌరవనీయులైన ప్రిన్సిపాల్స్ అందరూ ఒకసారి ఆలోచించండి....ప్రభుత్వం తలుచుకుంటే మన సమస్యలలో చాలా వరకు పరిష్కరించవచ్చు.......

 ముఖ్యంగా  స్కూల్స్, డిగ్రీ college టైమింగ్స్ విషయము లో  నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా సమయం అవసరము లేదు... అంతే కాకుండా   విద్యార్థుల సంక్షేమo , గురుకులాల మనుగడ కోసం  మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది...

ప్రస్తుతం ప్రిన్సిపాల్స్ చాలా మంది వరుస పెట్టి సస్పెండ్ కావడానికి ప్రధాన కారణం ఈ  మెస్ చార్జీలు పెంచక పోవడం తో మెనూ ఫాలో అవలేక పోతున్న సంగతి అందరికి తెలిసిందే...

 provission s సరిపడా  సప్లై లేదు , క్యాటరింగ్ సిస్టం లో ఉన్న లోపాల వల్ల , వర్కర్స్ సరిపడ లేరు . వాటితో  పాటు గురుకులాలకు గత ఏడాది నుండి  కంటెజెన్ట్ బడ్జెట్ లేక  ఇటూ విద్యార్థులు , ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు....
   మిత్రులారా!
    అటు  పేరెంట్స్,సంఘాలు, మీడియా గురుకులాలను టార్గెట్ చేస్తున్నారు.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలామంది ప్రిన్సిపాల్స్ కి  దినదిన గండoగా గడపాల్సిన పరిస్థితులు వస్తాయి... రేపు జరిగే ధర్నా కార్యక్రమంలో వేలాదిగా తరలిరావడానికి ప్రతి ఒక్క ప్రిన్సిపాల్,  స్టాఫ్ సహకరించగలరని మనవి చేస్తున్నాము..
🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏.  
  
Alagoni Narsimhulu Goud
                     President (swu)
S.Ganesh
       General secretary 
K Janardan
      Working president 
B.Bixam Yadhav 
          Vice president 
M.Syam sunder
       Organizing secretary 
G. Nagi Reddy
        Organizing secretary 
T G A R I E A
✊🏻✊🏻✊✊
-----------------------------------------------------------------------------------------------------
🚩మహాధర్నా అలర్ట్🚩

  యావన్మంది గురుకుల ఉపాధ్యాయ / అధ్యాపక మిత్రులకు తెలియజేయునది ఏమనగా!!

   నేడు మనం నిర్వహించే మహాధర్నా పోలీసు వారి ముందస్తు అనుమతితోనే చేస్తున్నాము.ఎవరు భయపడాల్సిన పనిలేదు.ప్రజాస్వామ్య యుతంగా చేసే ధర్నాలు,పికేటింగులు,రాస్తారోకోలలో పాల్గొనడం మన హక్కులు సాధించుకోవడంలో భాగమే.✊

 కాబట్టి ఎటువంటి అనుమానం అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల స్పందన చూసి ఓర్వలేక, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ,పనిగట్టుకుని కొంతమంది 28/09/24 ధర్నా లేదన్న విష ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని,మా దృష్టికి వచ్చింది. అటువంటి చిన్న రాజాల, చిన్న స్వాముల గాలి వార్తలు అస్సలు పట్టించుకోవద్దు. భూమి బద్దలైన 28-09-2024 యథాతదంగా ధర్నా జరుగుతుంది.

 హక్కులకై కలబడు✊
బాధ్యతకై నిలబడు  ✊ తెలంగాణలోని యావత్ గురుకుల ఉపాధ్యాయ వర్గాన్ని, విద్యార్థి లోకాన్ని మరియు ప్రజాస్వామ్యవాదులందరినీ విజ్ఞప్తి చేస్తూ....
28th సెప్టెంబర్ 2024
🙏🙏🙏🙏🙏🙏🙏
 
మహా ధర్నా విజయవంతం చేయండి. 
ధర్నా చౌక్, ఇందిరా పార్క్, హైదరాబాద్.
టైమ్ :10. 30 am నుండీ.
-----------------------------
GURUKULA JAC & TS UTF
💐🪴💐🪴💐🪴💐🪴💐


---------------------------------------------------------------------------------------------------------

ఉపాధ్యాయ మిత్రులారా... 

సమస్యల గురించి బాధ పడుతూ whatsapp లో messages చేస్తే సమస్యలకు ఎప్పటికీ పరిష్కారం దొరకదు. మన కోసం మనలో ఒకరు ముందడుగు వేశారు వారి వెన్నంటి ఉండి పోరాటంలో భాగస్వమ్యులమై ముందుకు కదలాల్సిన సమయం ఇది. లేదంటే ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉండి పోతం.

 నెల గడవగానే జీతాల కోసం సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి ఇంకా ఎప్పటికీ మారదు..

ప్రభుత్వం సెలవుల గురించి మరియు వేరే విషయం గురించి Circular ఇచ్చినప్పుడు హెడ్ ఆఫీస్ వైపు ఎదురుచూసే పరిస్థితి ఇంకా ఎప్పటికీ మారదు 

Second Saturday సెలవు అనేది ఇక కలగానే మిగిలిపోతుంది.
హాలిడే డ్యూటీ కి CCL అనేది ఇంకెప్పటికీ సాధించలేము.
Night stay పేరుతో టీచర్ల తోటి నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయించే దౌర్భాగ్య స్థితి నుండి ఇంకెప్పటికీ 
విముక్తులం కాలేము 
చిన్న చిన్న సమస్యలకు బాధ్యులను చేస్తూ మనల్నీ సస్పెండ్ చేసే దాని నుండి తప్పించుకోలేము.
 పోరాటం నీరుగార్చేందుకు చాలా మంది కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రలు నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎక్కడో చదివాను పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్లు తప్ప అని.

 TSUTF ఎప్పటి నుండో ఉపాధ్యాయ  సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని పక్క దారి పట్టించి మనల్నీ మోసం చెయ్యాలి అని చూస్తున్నారు. ఒక్క సారి ఆలోచించండి సమస్య మనది పోరాటం మనది. పెన్ను - ఛాక్ పీస్ పక్కన పెడితే సమస్యల పరిష్కారం దొరకదు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఈ పోరాటంలో ముందు ఉండి పోరాటం చేయాలని వేడుకుంటున్నాను. 

మహా ధర్నా కు నేను వెళ్తున్నాను మరి మీరు???

-----------------------------------------------------------------------------------------------------
గౌరవనీయులైన ప్రిన్సిపాల్స్ అందరూ ఒకసారి ఆలోచించండి....ప్రభుత్వం తలుచుకుంటే మన సమస్యలలో చాలా వరకు పరిష్కరించవచ్చు....... ముఖ్యంగా  స్కూల్స్, డిగ్రీ college టైమింగ్స్ విషయము లో  నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా సమయం అవసరము లేదు... అంతే కాకుండా   విద్యార్థుల సంక్షేమo , గురుకులాల మనుగడ కోసం  మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది...ప్రస్తుతం ప్రిన్సిపాల్స్ చాలా మంది వరుస పెట్టి సస్పెండ్ కావడానికి ప్రధాన కారణం ఈ  మెస్ చార్జీలు పెంచక పోవడం తో మెనూ ఫాలో అవలేక పోతున్న సంగతి అందరికి తెలిసిందే...provissions సరిపడా  సప్లై లేదు , క్యాటరింగ్ సిస్టం లో ఉన్న లోపాల వల్ల , వర్కర్స్ సరిపడ లేరు . వాటితో  పాటు గురుకులాలకు గత ఏడాది నుండి  కంటెజెన్ట్ బడ్జెట్ లేక  ఇటూ విద్యార్థులు , ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు....  అటు  పేరెంట్స్,సంఘాలు, మీడియా గురుకులాలను టార్గెట్ చేస్తున్నారు.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలామంది ప్రిన్సిపాల్స్ కి  దినదిన గండo గా గడపాల్సిన పరిస్థితిలో వస్తాయి... రేపు జరిగే ధర్నా కార్యక్రమంలో వేలాదిగా తరలిరావడానికి ప్రతి ఒక్క ప్రిన్సిపాల్,  స్టాఫ్ సహకరించగలరని మనవి చేస్తున్నాము..🙏🏻🙏🏻🙏🏻.                          -TEA (GKLM)✊🏻✊🏻






TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top