Search This Blog

Wednesday, August 14, 2024

Promotion fixation info


*Promotion fixation info*


*ముందుగా పదోన్నతి పొందిన ఉపాద్యాయ మిత్రులకు శుభాకాంక్షలు* 💐🍫


ప్రమోషన్ ఫిక్షేషన్ కోసం ఆప్షన్ ఏమి ఇవ్వమంటారు అని పదోన్నతి తీసుకున్న మిత్రులు చాలా మంది నాకు పోన్ చేసి అడుగుతున్నారు వారి కోసం ఈ వివరణ.


ఫీడర్ కేడర్ లో SPP -II (24సంవత్సరాలు) స్కేల్ తీసుకోకుండా పదోన్నతి తీసుకున్నప్పుడు ఆపోస్ట్ లో వేతన స్థిరీకరణ కోసం రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఒకటి పదోన్నతి తేదికి లేదా ఇంక్రిమెంట్ తేదికి.


*పదోన్నతి తేదికి ఆప్షన్ ఇస్తే:*

పదోన్నతి తేదికి ఆప్షన్ ఇస్తే పదోన్నతి పొందిన రోజున FR 22B తో పే ఫిక్షేషన్ జరుగుతుంది అంటే పదోన్నతి రోజు 2 ఇన్క్రిమెంట్లు వస్తాయి, తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఫిక్షేషన్ జరిగిన తేది నుండి ఒక సంవత్సరం తరువాత వస్తుంది. 


*లోయర్ కేడర్ ఇంక్రిమెంట్ తేదికి ఆప్షన్ ఇస్తే:*

ఇంక్రిమెంట్ తేదికి ఆప్షన్ ఇస్తే పదోన్నతి పొందిన రోజున FR 22a(i) తో పే ఫిక్షేషన్ జరుగుతుంది అంటే పదోన్నతి రోజు 1 ఇన్క్రిమెంట్ వస్తుంది, తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ రోజున లోయర్ కేడర్ ఇంక్రిమెంట్ ఇచ్చి రివైజ్డ్ ప్రమోషన్ ఫిక్షేషన్ FR 22B ప్రకారం జరిపితే మళ్లీ 2 ఇన్క్రిమెంట్లు వస్తాయి. ఫీడేర్ కేడర్ ఇంక్రిమెంట్ తేది అలాగే పదోన్నతి పోస్టులో కూడా ఉంటుంది.


*24సంవత్సరాల సర్వీసు పూర్తి అయి SPP -II స్కేల్ తీసుకున్న వారి ఫిక్షేషన్*

24 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి SPP -II స్కేల్ తీసుకున్న వారు ఫిక్షేషన్  వీరి వేతన స్థిరీకరణ ప్రమోషన్ తేది రోజు FR 22a(i) read with FR 31(2) తో చేయాలి. అంటే పదోన్నతి పొందిన రోజున ఒక ఇంక్రిమెంట్ FR22a(i) ప్రకారం అదేవిధంగా ఫీడర్ కేడర్ ఇంక్రిమెంటు తేదీ రోజున ఇంక్రిమెంటు వస్తుంది. 


ఆప్షన్ ఇచ్చెప్పుడు మీ పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలి... మీరు ఏ నెలలో రిటైర్ అవుతున్నారు అనేది చూసుకుని ఆ నెల వరకు ఏ ఆప్షన్ ఇస్తే ఎక్కువ పే అవుతుందో చూసుకుని ఆప్షన్ ఎంచుకోగలరు.


చాలా వరకు ఇంక్రిమెంట్ తేదికి ఆప్షన్ ఇస్తే ఎక్కువ పే ఉండే అవకాశం. 


ఇంక్రిమెంట్ తేదికి ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఒక ఇంక్రిమెంట్ అదనంగా తీసుకుంటున్న నెలలను ఇంకా మిగిన ఉన్న సర్వీస్ తో గుణించాలి.

ఉదాహరణకి ఒకరికి జూన్ నెలలో పదోన్నతి వచ్చి ఇంక్రిమెంట్ తేది ఫిబ్రవరి నెలలో ఉంది వారికి ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉంది వారి రిటైర్ మెంట్ జూలై లో ఉంది అనుకున్నా వారు ఇంక్రిమెంట్ తేదికి ఆప్షన్ ఇస్తే లాభం.


👉🏼 *మీరు లోయర్ కేడర్ లో తీసుకుంటున్న పే పదోన్నతి వేతన స్కేల్ లోని కనీస వేతనం కంటే కూడా మూడు లేదా అంత కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ల వ్యత్యాసం ఉన్నట్టు అయితే వారి పే నేరుగా పదోన్నతి పొందిన రోజున FR22B తో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మినిమం పే వద్ద ఫిక్షేషన్ చేసి సంవత్సరం తరువాత వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలి.* (TRT 2017)


👉🏼 జూన్ నెలలో ఇంక్రిమెంట్ ఉండి ఇదే నెలలో పదోన్నతి తీసుకున్న వారు పదోన్నతి తేదికి అప్షన్ ఇవ్వండి లోయర్ కేడర్ ఇంక్రిమెంట్ కి అదనంగా FR 22B ఫిక్షేషన్ లో రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి. అంటే మొత్తం 3. 


👉🏼 *జూన్, 2024 లో రిటైర్మెంట్ లేని,  జూలై నెలలో ఇంక్రిమెంట్ ఉన్న వారు ఇంక్రిమెంట్ తేది జూలై కి ఆప్షన్ ఇచ్చుకోండి.* (డీఎస్సీ 2001 వారు 2010 లో జూలై లేదా అక్టోబర్ నెలకి జూనియర్ తో ప్రిఫోన్ చేసుకున్నారు వారు లోయర్ కేడర్ ఇంక్రిమెంట్ తేది అంటే క్రితం వార్షిక హెచ్చింపు పొందిన నెలనే తీసుకోవాలి అంటే ప్రిఫోనే చేసుకుని ఆ తరువాత కొనసాగుతున్న ఇంక్రిమెంట్ తేది నే పరిగణలోకి తీసుకోవాలి కానీ మొదటి నియామకం అప్పటిది కాదు.)



*మీ ఫిక్షేషన్ కోసం కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి instructions లో ఏ ఆప్షన్ లాభదాయకం అనేది చెక్ చేసుకోండి. ఆతరువాత ఫిక్షేషన్ ఆప్షన్ ఇవ్వండి.*


ఒకసారి పదోన్నతి ఫిక్షేషన్ అనుభవజ్ఞుల సలహా తీసుకుని పూర్తి చేసుకోగలరు.




https://www.putta.in/2023/10/Promotion-Fixation-FR-22-ai-22B-promotion-date-increment-date%20B.html?m=1


All the best 👍🏼



TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top