Search This Blog

Friday, August 23, 2024

ప్రభుత్వ గురుకులాల యొక్క సమయపాలనను మార్చాలి- గురుకులాలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలను పరిష్కరించాలి. గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారికి గురుకుల జేఏసీ పక్షాన వినతి పత్రాల సమర్పణ. ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాల

 








ప్రభుత్వ గురుకులాల యొక్క సమయపాలనను మార్చాలి- గురుకులాలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలను పరిష్కరించాలి. 

 గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారికి గురుకుల జేఏసీ పక్షాన వినతి పత్రాల సమర్పణ.

 ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాల ఉపాధ్యాయ వర్గము మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి స్కూల్ టైమింగ్స్ విషయంలో గల ఇబ్బందులను గురుకుల జేఎసి పక్షాన చీఫ్ సెక్రటరీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది. గతంలో గురుకులాల యొక్క సమయం ఉదయం 8 గంటల నుంచి ఉన్నప్పటికీ అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలల యొక్క పరిస్థితిని వారికి సవివరంగా వివరించడం జరిగినది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వెయ్యికి పైగా గురుకులాలలో సుమారు 600 వరకు గురుకులాలు ప్రైవేటు బిల్డింగ్లలో అరా కొర సౌకర్యాలతో నడుస్తున్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొని రావడం జరిగినది.  ప్రస్తుతం ఉన్నటువంటి సమయపాలన ఉదయం 8 గంటల నుంచి ఉండడంవల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పరిస్థితుల వల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొని గురుకులాల ఉన్నతికి పని చేస్తున్నారని కనుక అన్ని ప్రభుత్వ గురుకులాల యొక్క స్కూల్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మార్చాలి అనే జేఏసీ  విన్నతికి  గౌరవ చీఫ్ సెక్రటరీ గారు తప్పక పరిశీలిస్తామని చెప్పారు. 

 అదేవిధంగా గురుకులాలు ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రాథమిక సమస్యలనుతీసుకొని రావడం జరిగింది

1. గురుకులాలలో టైం టేబుల్ ఉదయము 9:00 నుంచి 4:30 కు మార్చడం.

2. ప్రభుత్వ గురుకులాలలోని విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని 

3. ప్రభుత్వ గురుకులాలను విద్యార్థులను సమీప డాక్టర్లు వారానికి రెండుసార్లు కచ్చితంగా పరీక్షించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని 

4. అన్ని గురుకులాల అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాల కోసము ఒక కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం.

5. గతంలో ఉన్నటువంటి పారిటీ స్కేల్స్ పునరుద్ధరించే పునరుద్ధరించడం.

6. గురుకులాలలో ఉద్యోగులు కూడా  ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలను ఒకటో తారీకు  పొందే విధంగా 0 1 0 కింద చెల్లించే విధంగాప్రయత్నాలు చేయాలని.

7. ఒకప్పుడు గురుకులాలలో టీజీటీ టు పిజిటి పిజిటి టు జె ఎల్ జేఎల్పి ప్రిన్సిపాల్ అన్ని ప్రమోషన్స్ కూడా 100% ఉండేవని కానీ ఆ ప్రమోషన్ చానల్స్ ను 50 శాతానికి కుదించడం జరిగిందని తద్వారా చాలామంది ప్రమోషన్స్ కోల్పోయే అవకాశం ఏర్పడ్డదని , మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ప్రమోషన్స్ 70 :30 నిష్పత్తిలో ఇస్తున్నారని గురు కులాలలో కూడా అదే రకమైనటువంటి నిష్పత్తినిస్తూ ప్రమోషన్  విడుదల చేయాలని,

8. అన్ని గురుకులాలలో ఒకే సమాన స్టాఫ్ పెట్ట్రన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాలలో కూడా రెండు పీజీటీ మాథ్స్, పీజీటీ బయాలజీ, పీజీటీ ఫిజికల్ సైన్స్, పి జి టి హిందీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని 

9. అన్ని గురుకులాలలో కూడా క్వార్టర్స్ మెయింటెనెన్స్ సరిగా లేని కారణంగా రెంట్ ఫిక్స్ చేస్తూ ఉద్యోగులకు వచ్చేటటువంటి హెచ్ఆర్ఏ యధావిధిగా చెల్లించాలని

10. ఆర్టు, క్రాఫ్ట్, మ్యూజిక్ వారికి నవోదయ కేంద్రీయలలో మాదిరిగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు క్రియేట్ చేయాలని 

11. గురుకులాలలో నుండి ఇతర డిపార్ట్మెంట్ లకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెళుతున్న వారికి పే ప్రొటెక్షన్ సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని 

12. అన్ని గురుకులాలలో కూడా డిప్యూటీ వార్డెన్ పోస్టులు మంజూరు చేస్తూ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి  కేర్ టేకర్ బాధ్యతలను తొలగించాలని

13. గురుకులాల్లో ఉన్నటువంటి సంఘాలను కూడా జాయింట్ స్టాప్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకొని రావాలని 

14. అన్ని గురుకులాలలో కూడా కేర్ టేకర్ మరియు వైస్ ప్రిన్సిపాల్ ఒకే మాదిరిగా చెల్లించాలని.

 మొదలైన అన్ని సమస్యల పైన గౌరవ చీఫ్ సెక్రటరీ శ్రీమతి ఏ శాంతి కుమారి గారు సానుకూలంగా స్పందిస్తూ  నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందనిఆదిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతి కుమారి గారు చొరవ చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 కృతజ్ఞతలు 

 మామిడి నారాయణ

 అధ్యక్షులు

 డాక్టర్ మధుసూదన్ 

 జనరల్ సెక్రెటరీ 

 కే జనార్ధన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ 

 ఏ నరసింహులు గౌడ్ 

 అధ్యక్షులు ఎస్ డబ్ల్యూ 

 ఎస్ గణేష్ 

 జనరల్ సెక్రెటరీ ఎస్ డబ్ల్యూ

 బీ  భిక్షం యాదవ్ 

 వైస్ ప్రెసిడెంట్ ఎస్ డబ్ల్యూ.








TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top