నానబెట్టిన పల్లీలు ప్రతి రోజూ తింటే బోలెడు లాభాలు..! ఒక్కొక్కటి తెలిస్తే..
పల్లీలను నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల స్థాయిలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థకు పల్లీలను సులువుగా అరిగించేందుకు సహాయపడుతుంది. అలాగే, కొంతమందిలో పల్లీలను తినడం వల్ల అలెర్జీ సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారు పల్లీలను నానబెట్టి తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం తగ్గుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న వేరుశెనగ చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.
Soaked Peanuts
డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టడం వల్ల వాటిలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయిన దాదాపు అందరికీ తెలుసు..! అందుకే ఇటీవల చాలా మంది ఆరోగ్యం పట్ల అవగాహనతో బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తినటం అలవాటుగా చేసుకుంటున్నారు. ఇలా నానబెట్టడం వల్ల డ్రై ఫ్రూట్ లో ఉండే ప్రోటీన్ పాక్షికంగా జీర్ణమవుతుంది. అందుకే వీటిని తినడానికి ముందు నానబెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, పల్లీలను కూడా అలాగే రాత్రంత నానబెట్టి తింటే ఏమవుతుందో మీకు తెలుసా..? ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వేరుశనగలు నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే వేరుశెనగలను నానబెట్టడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తక్కువ GI, అధిక ఫైబర్ కలిగిన నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నానబెట్టిన వేరుశెనగలను మితంగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న వేరుశెనగలు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే వేరుశెనగలను తీసుకోవడం వల్ల మీ పొట్ట త్వరగా నిండుతుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వేరుశనగలు నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. దీంతో వేరుశెనగలోని ముఖ్యమైన ఖనిజాల శోషణ కూడా మెరుగుపడుతుంది. ఇది గింజల్లో ఉండే మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను శరీరం బాగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. శరీరానికి మంచి పోషణ ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఫైటిక్ ఆమ్లంతో పాటుగా వేరుశనగల్లో లెక్టిన్లు వంటి ఇతర యాంటీ-పోషకాలు కూడా ఉంటాయి. పల్లీలను నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల స్థాయిలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థకు పల్లీలను సులువుగా అరిగించేందుకు సహాయపడుతుంది. అలాగే, కొంతమందిలో పల్లీలను తినడం వల్ల అలెర్జీ సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారు పల్లీలను నానబెట్టి తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం తగ్గుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న వేరుశెనగ చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.