*🌹ఇటీవల ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు ప్రమోషన్ పే ఫిక్సేషన్ విధానం అవగాహన కొరకు*👇🏿
♦️ *పదోన్నతి వేతన స్థిరీకరణ జి.ఓ.నెం: 96 ఫైనాన్స్ తేది: 20-5-2011 రూలు 7(viii) ప్రకారం జరుగును*
*ఎ) పదోన్నతికి ముందు ఫీడరు కేడర్ నందు 24 సం.ల స్కేలు పొందియున్నచో వీరు అసలు ఆప్షన్ ఇచ్చే అవకాశం లేదు. వీరికి పదోన్నతి తేదికి ఒక ఇంక్రిమెంట్ FR22 a(i) ప్రకారంగా వేతన స్థిరీకరణ చేయబడును. మరలా ఫీడరు కేడరు లోని రెగ్యులర్ ఇంక్రిమెంటు FR 31 (2) ప్రకారంగా కొనసాగును. వీరికి పదోన్నత కేదరులో 6/12/18/24 సం.ల స్కేలు పొందుటకు ఎటువంటి అర్హత లేదని గమనించాలి.*
*బి) పదోన్నతికి ముందు ఫీడరు కేడర్ నందు 24 సం॥ల స్కేలు పొందకుంటే వీరు క్రింద తెలుప పడిన రెండు ఆప్షన్లో ఏది లాభదాయకం అనుకుంటే దానిని నిర్ణీత ఆప్షన్ ఫారము నందు నమోదు పరచి డిడిఓ గారికి సమర్పించాలి.*
1.*పదోన్నతి తేదికి ఆప్షన్ ఇచ్చే అవకాశము.*
👉 *ఆ తేదికే రెండు ఇంక్రిమెంట్లు తో ఫిక్సేషన్ చేయబడును. వీరికి తదుపరి ఇంక్రిమెంటు 12 నెలల తర్వాతనే వస్తుంది. కావున వీరి ఇంక్రిమెంట్ నెల మారును.*
2. *ఫీడరు కేడరు లోని రెగ్యులర్ ఇంక్రిమెంటు తేదికి ఆప్షన్ ఇచ్చే అవకాశము*.
👉 *వీరికి వేతన స్థిరీకరణ రెండు పర్యాయములు ( ఇనిషియల్ ఫిక్సేషన్ మరియు రీ ఫిక్సేషన్ ) జరుగును.*
👉 *ఇనిషియల్ ఫిక్సేషన్*:
*FR22a(i) ప్రకారంగా పదోన్నతి తేదికి ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. ఎరియర్స్ పదోన్నతి తేది నుండి రెగ్యులర్ ఇంక్రిమెంటు తేదికి ముందు రోజు వరకు చెల్లిస్తారు.*
👉*రీ- ఫిక్సేషన్* : *FR22B ప్రకారంగా ఆప్షన్ ఇచ్చిన రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేదికి నార్మల్ ఇంక్రిమెంటుతో పాటుగా లోయరు కేడరులో ఒక ఇంక్రిమెంట్ మరియు హాయ్యర్ కేడరులో మరొక ఇంక్రిమెంట్ తో పాటుగా మూడు ఇంక్రిమెంట్లతో ఇంక్రిమెంట్ తేదీకి fixation చేయుదురు.*
👉 *గమనిక:* *జి.ఓ.నెం.145 ఫైనాన్స్ తేది: 19-5-2009 ప్రకారంగా ఉద్యోగి నిర్ణీత సమయంలో ఆప్షన్ ఇవ్వకుంటే లాభదాయకంగా ఉండే ఆప్షన్ ఎంచుకొని వేతన స్థిరీకరణ చేయవలసిన భాద్యత డి.డి.ఓ.లదే.*
*పదోన్నతి తేదికి తర్వాత ఎంత దగ్గరలో రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేది ఉంటే అంతగా లాభదాయకం.*