Cholesterol Symptoms: ఈ లక్షణాలున్నాయా.? మీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగడాన్ని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్త ధమనుల్లో అడ్డుగా ఫలకాలు ఏర్పడటం. దీంతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. తద్వారా కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు...
తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం కారణంగా ఇటీవల అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు దరిచేరుతున్నాయని నిపుణులు అంటున్నారు.
అయితే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగడాన్ని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్త ధమనుల్లో అడ్డుగా ఫలకాలు ఏర్పడటం. దీంతో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. తద్వారా కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదులను కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..
* మగవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయని తెలియజేయడంలో గ్జాంథెలాస్మ అనేది ముందస్తు లక్షణంగా చెప్పొచ్చు. ఇందులో కంటి కింద పచ్చ రంగు మారుతుంది. అలాగే ముక్కు దగ్గర కూడా ఇలాంటి లక్షణమే కనిపిస్తుంది. ఇలాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
* కొన్ని సందర్భాల్లో ఛాతిలో నొప్పి కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి లక్షణంగా చెప్పొచ్చు. ధమనుల్లో కొవ్వు పెరిగితే అథెరోక్లోరోసిస్ అనే వ్యాధికి దారి తీస్తుంది. దీనివల్ల రక్త సరఫరా గుండెకు అడ్డుగా ఫలకాలు అడ్డుపడినప్పుడు ఛాతిలో నొప్పి వేధిస్తుంది. కాబట్టి ఛాతిలో నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా కాళ్లకు రక్తం సరిగ్గా సరఫరా జరగదు. కాబట్టి కాళ్లు మొద్ది బారినట్లు కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్లు అనుమానించాలని చెబుతున్నారు.
* శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పాడుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో హార్ట్ ఫెయిల్యూర్‌కు కూడా దారితీస్తుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడంలో కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.