ఈరోజు 23 జూన్ 2024 నాడు ప్రభుత్వ గురుకులాలలో 317 జివో ద్వారా జరుగుతున్నటువంటి కేటాయింపులలో అన్ని స్పోజ్ కేసులను పరిగణలోకి తీసుకోవాలని కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నటువంటి విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించి సెంట్రల్ గవర్నమెంట్, జుడీషియరీ, రైల్వేలు, బ్యాంకులు మరియు ఇతర పబ్లిక్ సెక్టర్ల వారికి కూడా అవకాశం కల్పించాలని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది.
2. 2022లో జరిగిన కేటాయింపు తర్వాత ఉన్నటువంటి అన్ని మెడికల్ కేసును కూడా పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరనైనది.
3. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో టీచర్స్ ఇస్తున్నటువంటి బదిలీల అవకాశాన్ని అన్ని గురుకుల పాఠశాలలకు కూడా వర్తింపజేయాలని గురుకుల జేఏసీ పక్షాన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ తగిన సూచనలతో డిపార్ట్మెంట్స్ కు ఇన్స్ట్రక్షన్ ఇస్తామని చెప్పారు.
గురుకుల జేఏసీ రిప్రజెంటేషన్ అనుసరించి అన్ని డిపార్ట్మెంట్లలో స్పౌజ్ కేసెస్ కు, అన్ని మెడికల్ కేసెస్ కు, అదేవిధంగా అన్ని గురుకుల విద్యా సంస్థలలో కూడా బదిలీ నిబంధనలు వర్తింప చేస్తామని ఇచ్చిన హామీకి వారికి కృతజ్ఞతలు తెలియజే స్తున్నాము.
కృతజ్ఞతలతో
డాక్టర్ మధుసూదన్ జనరల్ సెక్రటరీ
కే జనార్ధన్
ఆర్గనైజింగ్ సెక్రెటరీ
ఏ .నరసింహులు గౌడ్
అధ్యక్షులు టీజీ సోషల్ వెల్ఫేర్.
ఎస్ గణేష్ జనరల్ సెక్రెటరీ టీజి సోషల్ వెల్ఫేర్.