Search This Blog

Sunday, June 16, 2024

నాన్న

 *HAPPY FATHER'S DAY*


🙍‍♂️*నాన్న* కూ *కన్నీళ్లు* ఉంటాయి..


🙍‍♂️ *నాన్న* మనకోసం ఏం చేశాడో,,

 ఏం  *కోల్పోయాడో* మనకు తెలియదు..!


🙍‍♂️ *జీవితాంతం* పిల్లల కోసం *తపిస్తూ, వారి అభివృద్ధి* కోసం పాటుపడే వ్యక్తి *తండ్రి* తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు.  


*నాన్న* మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.

 

🙍‍♂️ ఎందుకంటే..  *నాన్న* ఎవరికీ చెప్పడు. *పిల్లలకి, భార్య* కి అసలు చెప్పడు. *అమ్మ* లా *ప్రేమ* ను బయటికి చూపించడం *నాన్న* కు రాదు. *నాన్న* ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

 

🙍‍♂️ *ఎప్పుడూ పనేనా* ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. *పెళ్లై, పిల్లలు* పుట్టగానే *నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*

 

🙍‍♂️మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. 


🙍‍♂️ *వృద్ధాప్యం* ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న *డాక్టర్‌* ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

 

🙍‍♂️ తన *పిల్లలు* గొప్ప వాళ్లు అవుతారని *నాన్న* కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. 


*ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు.* మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని *ఆశ.*

 

🙍‍♂️ *ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా* చేస్తాడు. ఎక్కడ, ఎన్ని *సంతకాలు* పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు *అమ్మ* ఏడ్వడం చూశాం కానీ, *నాన్న ఏడ్వడం* ఎప్పుడైనా చూశారా? *నాన్న* కూడా *ఏడుస్తాడు*. కానీ మీ ముందు *ఏడ్వడం* ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని *ఏడుస్తాడు.**

 

🙍‍♂️ పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. *నాన్న* అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే *పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం* మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, *నేను ఎవరి కోసం బతికాను*?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. *నా కోసం నేను* ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.*

 

🙍‍♂️ నిజానికి *నేను* అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో *నాన్న* ను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*

 

 🙍‍♂️కొడుకు ఎంత మంచివాడు *ప్రయోజకుడైతే* తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా *తండ్రి* ని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ *నాన్న* స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ *నాన్న* పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.


 🙍‍♂️ *,పిల్లల* కోసం తన *రిస్క్‌* తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన *కెరీర్‌* ను *నాశనం* చేసుకుంటాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న *ఎనర్జీ* పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది  *నాన్న* లు జీవితంలో తమ *పిల్లల* కోసం *ఆర్డినరీ* గా మిగిలిపోయారో.....


ప్రతి *నాన్న* కు 🙏

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top