ఎస్సీ గురుకుల సంస్థలో 317 జీవో అమలులో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు సంస్థ కార్యదర్శి శ్రీమతి అలగు వర్షిని ఐఏఎస్ గారు సంస్థలోని సంఘాలతో సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో వచ్చిన సందేహాలను మరియు సలహాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది విధముగా నిర్ణయించడం జరిగినది.
1. ఈరోజు సమావేశము కేవలం 317 జీవో అమలులో గల ఇబ్బందుల పై మరియు సందేహాలపై మాత్రమే నిర్వహించడం జరిగినది.
2. ఈరోజు రాత్రి వరకు అన్ని ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల జాబితా ప్రకటించడం జరుగుతుంది.
3. ఈ జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దడానికి సూచనలను రేపు రాత్రి వరకు గడువు ఇవ్వడం జరిగినది.
4. అన్ని సూచనలను పరిగణలోకి తీసుకున్న పిదప ఫైనల్ వేకెన్సీ లిస్ట్ డిస్ప్లే చేయబడుతుంది.
5. 317 జీవో ప్రకారం డిస్టిక్, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల వారీగా ఒకే సీనియార్టీ లిస్టును ప్రకటించడం జరుగుతుంది.
6. ఈ సీనియార్టీ లిస్టులలో ఉండి థిస్ లోకేటెడ్ అయినటువంటి 317 ఉద్యోగ ఉపాధ్యాయులను కౌన్సిలింగ్ పిలిచి ఫైనలైజ్ అయినటువంటి వేకెన్సీస్ ను చూపిస్తూ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.
7. పోస్టింగ్స్ అన్నీ కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా ప్రత్యక్ష పద్ధతి ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
8. థిస్ లోకేటెడ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల కు గల స్పోస్, మెడికల్ మరియు వ్యక్తిగతమైనటువంటి కారణాలన్నిటినీ కౌన్సిలింగ్లో పరిగణలోకి తీసుకొని ప్రతి ఉపాధ్యాయునికి ఉద్యోగికి కూడా తగు న్యాయం చేయడానికి సంస్థ కార్యదర్శి పూర్తి హామీ ఇచ్చారు.
9. కోర్టు కేసులలో ఉన్నటువంటి వారికి కూడా వారి గ్రీవెన్స్ ను పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని కార్యదర్శి గారు స్పష్టం చేశారు.
అందువల్ల మిత్రులారా! గురుకుల జేఏసీ పక్షాన మరియు టిగారియా పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ప్రత్యక్ష పద్ధతిలో సాఫీగా జరిగే కౌన్సిలింగ్ వల్ల ప్రతి ఉపాధ్యాయ ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుంది కాబట్టి కోర్టు కేసులో ఉన్నటువంటి మిత్రులు కూడా ఆలోచించి అవసరమైతే కోర్టు కేసులు విత్ డ్రా చేసుకోవడానికి కూడా ఎలాంటి సంకోచ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూన్నాము.
వేకెన్సీ లిస్ట్ లను వెంటనే ప్రకటించి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులకు తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తున్నటువంటి సంస్థ కార్యదర్శి శ్రీమతి అలుగు వర్షిని గారికి మరి అదే విధంగా ఇతర అధికారులకు గురుకుల జేఏసీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.
ప్రతి ఉపాధ్యాయుని సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని వ్యక్తిగతంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కృతజ్ఞతలతో
మామిడి నారాయణ అధ్యక్షులు
డాక్టర్ మధుసూదన్
జనరల్ సెక్రెటరీ
శ్రీమతి శారద
శ్రీమతి శ్రీదేవి
శ్రీ నరసింహులు గౌడ్
శ్రీ గణేష్
శ్రీ భిక్షం.