🛑ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం
(world hypertension day)
-- జంట పక్షుల్లాగా బిపి, షుగర్ జంట వ్యాధులుగా వాసికెక్కాయి గత రెండు దశాబ్దాలుగా. ఒకప్పుడు అంతగాలేని ఈ రెండు ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి. యాభై వయసు దాటిన వారెవరిని కదిపినా ఈ రెండూ లేదా ఈ రెండింటిలో ఒకటో ఉందంటారు. నియంత్రణ రేఖ దాటితే ఈ రెండు వ్యాధులు ప్రమాదకరమైనవే .. ప్రాణాంతక వ్యాధులే. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం గనుక బిపి గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం. శరీరంలో రక్తప్రసరణ సజావుగా లేకపోతే హెచ్చుతగ్గుల వలన బిపి వస్తుంది. షుగర్ కంటే డేంజరస్ బిపి అని వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే సడెన్ గా బిపి హై కావొచ్చు లేదా లో కావొచ్చు. రెండూ ఇబ్బందికరమే. గనుక 30-35 దాటిన ప్రతి ఒక్కరూ బ్లడ్ ప్రషర్ గురించి తెలుసుకుని తగు నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న జీవనసరళి కారణంగా బిపి రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ ని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా బిపి ని కంట్రోల్ చెయ్యడానికి.. ఏటా మే 17న world hypertension day గా నిర్ధారించి.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. ఏటా సుమారుగా 75 లక్షల మరణాలు బిపి కారణంగా సంభవిస్తున్నాయని తేల్చింది. బిపి ఉండవలసిన స్థాయిలో ఉండాలి. తగ్గినా పెరిగినా ప్రమాదమే. బిపి మనకి రాకుండా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనకి కోపం రోషం ద్వేషం ఆవేశం గాభరా వంటివి ఉండకూడదు, ప్రతీ చిన్న విషయానికి ఇతరులతో వాదించే ప్రోగ్రాం పెట్టుకో కూడదు, ఆలోచనలో స్పష్టత ఉండాలి, ఒంట్లో మంచినీరు ఎప్పుడూ ఉండే విధంగా మంచి నీళ్ళు తాగుతుండాలి, ఉప్పు పూర్తిగా మానేయకుండా అతికొద్ది పరిమాణంలో శరీరంలోకి వెళ్లాలి.. సోడియం తగ్గిపోయినా ప్రమాదమే అని తెలుసుకోవాలి, ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి, శరీరానికి శ్రమ వ్యాయామం ఉండాలి, రోజూ లేదా రోజు విడిచి రోజైనా ఒళ్ళంతా మంచి ఆయిల్ తో మాసేజ్ చేసుకోవాలి, కడుపునిండా తినకుండా ఓ 15-20 శాతం ఖాళీ ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకో గలిగితే.. బొట్టుపెట్టి పిలిచినా బిపి మన జోలికి రాదు. ఐనా ఇంట్లో, ఉద్యోగ రీత్యా, వ్యాపార లావాదేవీల వలన ఈ టెన్షన్ల వలన బిపి రావడం సహజమే. వెంటనే వైద్యులను సంప్రదించి తగువిధంగా మెడిసిన్స్ వాడాలి. రెగ్యులర్ గా నిర్ణీత సమయాల్లో చెకప్స్ కి వెళుతుండాలి. తల తిరగడం, కళ్ళు మసకబారడం, నీరసం, వంటివి లో బిపి లక్షణాలు. విపరీతమైన తలనొప్పి, జ్వరం, అలసట వంటివి హై బిపి లక్షణాలు. ఇప్పుడు బిపి కంట్రోల్ లో తేవడానికి ఎన్నో మంచి మెడిసిన్స్ వచ్చాయి. డాక్టర్ సలహా ప్రకారం రెగ్యులర్ గా వేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం.. బిపి మాత్ర ప్రభావం 12 లేక 24 గంటల కంటే ఎక్కువ ఉండదు. గనుక బిపి ఉన్నవారు ఒక్కరోజు కూడా మానకుండా ఖచ్చితంగా నిర్ణీత సమయాల్లో వేసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నాసరే మానకుండా వేసుకోవాలి. బిపి ఉన్నవారు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటుంటే మానేయాలి. ట్యాబ్లెట్లు రోజూ అవసరం కనుక ఎప్పుడూ sufficient గా ఇంట్లో ఉంచుకోవాలి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా బిపి గురించి మనకి తెలిసిన విషయాలు నలుగురికీ చెప్పి నియంత్రణకు మనవంతు కృషి మనం చేద్దాం.. తగు జాగ్రత్తలు తీసుకుంటే బిపి ని జయించవచ్చును. మన బిపి మన కంట్రోల్లోనే.. ఇదే ఈరోజు మన స్లోగన్..
------