Search This Blog

Sunday, March 17, 2024

SSC Invigilator లకు సూచనలు

*💥SSC Invigilator లకు సూచనలు*

 *📱Invigilators ఎవరు కూడా examination centre కు cell phone  తీసుకురావద్దు.*

*1. ఇన్విజిలేటర్లు పరీక్ష రోజు  8:30am కు సెంటర్ లో ఉండాలి.*

*2. అమ్మాయిలను మహిళ ఉపాధ్యాయులు తనిఖీ నిర్వహించాలి*  

*3. ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది*

*4.ఇన్విజిలేటర్ అందరు కూడా 9am లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి*

*5. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి*

*6. విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి*

*7.OMR Sheet లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి. తమాదే అని సరిచేసుకోవాలి*

*8.Main Answer Sheet లపై SNo ఉందా లేదా చెక్ చేసుకోవాలి*

*9. విద్యార్థులు OMR పై సంతకం చేసిన తర్వాతనే మీరు నిర్దారించుకొని సంతకం చెయ్యాలి.మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి*

*10. 9.25am లోగా స్టిక్కర్స్ వేయడం సైన్  చేయడం అయిపోవాలి*

*11. సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి.*

*12. OMR షీట్ పైన Answer Sheet నంబర్ వేయించాలి*

*13. ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో HT No. వేయమని చెప్పాలి.*

*14.స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి*

*15. మ్యాప్, గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి*.

*16. ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి invigilator సంతకం చేయాలి*

*17.విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు ఒకవేళ  టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి.*

*18. ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు.*

*19. ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి*

*20.స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి.*

 *21.ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి*

 *22.ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంతవరకు సహకరించాలి*

*23. ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు*

*24.ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ లను మారకూడదు*

*25 ఏదైనా  అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే రిలీవర్ను పెట్టి వెళ్లాలి*

*26.ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు*

*27. గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది*

 *28.మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్గా ఉండేలా చూసుకోవాలి*

*29. ప్రశ్నా పత్రములు అదే రోజున కు సంబంధించినవా? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి*

 *30.రాంగ్ క్యూస్షన్ పేపర్ వస్తే CS లేదా DO లకు రిటర్న్ చేయాలి*

*31. ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు*
 
*32.ఒకే స్కూల్ పిల్లలు వరుసగా లేట్ గా వస్తే సి ఎస్ /DO తెలియజేయాలి*

*33. ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో ఇన్విజిలేటర్ సంతకం చేయాలి.*

 *34.ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూ నట్లు గమనిస్తే సి CS, DO లకు తెలియజేయాలి. వెరీ ఇంపార్టెంట్*

*35. దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి*

*36 ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాగ్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి*

*37. మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది*

*38. పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే tag చేయించాలి*

*39.OMR పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి*

*40. ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు*

*41. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి*

*42.సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా?లేదా? అని పరిశీలించాలి*

*43. ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది*

*44. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, మ్యాప్, లపై పూర్తి సంతకం చేయాలి.*.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top