Search This Blog

Thursday, February 29, 2024

సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్

*సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్*

 👉 *FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు.*

 👉 *సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి (Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది.*

👉  *ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను.*
*(G.O.Ms.No.64 F&P తేది:01-03-1979)*
*(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)*

 👉 *సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్  లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.*

👉  *AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాక ముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు.*

 👉 *రెండు సం. కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు.*
(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)

👉  *సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.*

 👉 *సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే  Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.*

👉  *సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను.*

 👉 *జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము (Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము.*
*(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)*

👉  *సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి.*

👉  *ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీ చేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు.*
*(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)*

 👉 *ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండు చేయకూడదు. ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లించటమే కాకుండా,అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుoది. అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని సస్పెండు చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.*
*(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969)*

*www tgariea in*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top