Search This Blog

Saturday, February 24, 2024

సహజంగా… మనం పట్టించుకోవాల్సిన…సోషల్ రూల్స్


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సహజంగా…*
        *మనం పట్టించుకోవాల్సిన…*
                *సోషల్ రూల్స్!*
                 ➖➖➖✍️
```
 1. ఏవరికైన  రెండు సార్లకు మించి
    అదేపనిగా కాల్ చేయవద్దు. 
    వారు సమాధానం ఇవ్వకపోతే,    
    వారికి వేరే చాలా ముఖ్యమైన 
    పని ఉందని అర్థం. 
    (కొంతమంది ఫోను ఎత్తేవరకూ 
    మళ్ళీమళ్ళీ, మళ్ళీమళ్ళీ ఫోన్ 
    చేస్తూనే ఉంటారు)

 2. అవతలి వ్యక్తి అడగక ముందే 
    మీరు అరువు తీసుకున్న     
    డబ్బును వారికి తిరిగి ఇవ్వండి. 
    అది ఎంతచిన్న మొత్తమైనాసరే!      
    అది మీ వ్యక్తిత్వాన్ని 
    తెలియజేస్తుంది! 

 3. ఎవరైనా మీకోసం పార్టీ
    ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన
    వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్
    చేయవద్దు. వీలైతే మీ కోసం 
    వారిన ఆహారాన్ని ఎంపిక 
    చేయమని వారిని అడగండి.

 4. "మీకు ఇంకా వివాహం కాలేదా?
     మీకు పిల్లలు లేరా? 
     ఎందుకు మీరు ఇల్లు 
     కొనలేదు?" వంటి  
     ఇబ్బందికరమైన ప్రశ్నలను
     ఎదుటివారిని అడగవద్దు. 
     అవి వారి సమస్యలు!
     మీవి కావు!!

 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి 
    ఎల్లప్పుడూ మీరే తలుపు తెరిచి 
    లోపలికి ఆహ్వానించండి. 
    అమ్మాయి,అబ్బాయి,చిన్నా,పెద్దా  
    ఎవరైనా సరే,ఒకరిపట్ల మంచిగా
    ప్రవర్తించడం ద్వారా మీరు 
    చిన్నగా మారరు.

 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా 
    సరదాగా మాట్లాడుతున్నప్పుడు 
    దాన్ని వారు సరదాగా తీసుకోపోతే     
     వెంటనే దాన్ని ఆపివేయండి! 
     మరలా చేయవద్దు.

 7. బహిరంగంగా ప్రశంసించండి,
      ప్రైవేటుగా విమర్శించండి.

 8. ఒకరి బరువు గురించి మీరు
     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.
    “మీరు అద్భుతంగా 
     కనిపిస్తున్నారు” అని చెప్పండి.  
     అప్పుడు బరువు తగ్గడం    
     గురించి మాట్లాడాలనుకుంటే, 
      వారే మాట్లాడుతారు. 

 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు 
    ఫోటో చూపించినప్పుడు, 
    అదొక్కటే చూడండి.ఎడమ లేదా 
    కుడి వైపుకు స్వైప్ చేయవద్దు. 
    తర్వాత ఏముంటాయో మీకు 
    తెలియదు కదా!

 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా
     వ్యవహరిస్తారో అదే గౌరవంతో
     క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.
     మీ క్రింది వారిని గౌరవంగా 
     చూస్తే ప్రజలు ఖచ్చితంగా దాన్ని
     గమనిస్తారు.

 11. మిమ్మల్ని అడిగే వరకు 
     ఎప్పుడూ సలహా ఇవ్వకండి.

 12. సంబంధంలేని వారికి మీ 
     ప్రణాళికల గురించి చెప్పవద్దు. 

 13. ఒక స్నేహితుడు/సహోద్యోగి మీకు 
     ఆహారాన్ని ఆఫర్ చేసినప్పుడు 
     మర్యాదగా 'నో’చెప్పండి.కానీ, 
     రుచి లేదా వాసన చూసిన     
     తర్వాత 'నో' చెప్పవద్దు.
     అట్లా చేస్తే మీరు వారిని
     అవమానించినట్లే! 

 14. మరో ముఖ్య విషయం! 
     ఇతరుల విషయంలో 
     అనవసరంగా జోక్యం
     చేసుకోకుండా, మీ పనేదో మీరు
     చూసుకోండి!!

        చివరిది , అతి ముఖ్యమైనది:

15. ఇలా ఎవరైనా సలహాలు 
    ఇస్తుంటే,వీడేంటి ఉచిత 
    సలహాలు ఇస్తున్నాడు వీడికి  
    పనిపాటా లేదా అనుకోవడం 
    కాకుండా, వారికి కాస్త 
    సమయం కేటాయించి వారు 
    చెప్పేది విని , నచ్చితే 
    పాటించడం నచ్చకపోతే 
    వదిలెయ్యడం చేయండి.
    అంతేకానీ వారిని తక్కువగా 
    చూడకూడదు!
     వారు ఎవరైనా సరే పేద్దవారైన, 
     చిన్నవారైన.✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top