Search This Blog

Sunday, February 11, 2024

ప్రభుత్వ గురుకులాల ఉద్యోగ - ఉపాధ్యాయ జేఏసీ* పిలుపు మేరకు కార్యక్రమాల విజయవంతం చేయాలని విజ్ఞప్తి.

 *ప్రభుత్వ గురుకులాల ఉద్యోగ - ఉపాధ్యాయ జేఏసీ* పిలుపు మేరకు కార్యక్రమాల  విజయవంతం చేయాలని విజ్ఞప్తి. 

మిత్రులారా!

నేడు రాష్ట్రం లో వెయ్యి కి పైగా ప్రభుత్వ గురుకుల పాఠశాల/ కళాశాల మరియు డిగ్రీ , పిజి కాలేజ్ లు రాష్ట్రం లోని వివిధ యాజమాన్యల (ఎస్సీ,  ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్)   క్రింద పనిచేయు చున్నవి. ఈ ప్రభుత్వ గురుకులాల లు ఎన్నో సమస్యలతో కొట్టు మిట్టడుతున్నవి. ఈ సమస్యలపైన చర్చించి మరియు ప్రభుత్వం దృష్టికి తెచ్చుటకు గల సాధ్యాసాధ్యాలు చర్చిం చుటకు  నేడు హైదరాబాద్ గల నాగోల్ లోని సంగ భవనం లో  జరిగిన సమావేశం లో ప్రభుత్వ  గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటుకు నిర్ణయిస్తు తీర్మానం చేయటం జరిగింది.  ఇకపైన అన్ని కార్యక్రమాలు జేఏసీ బ్యానర్ మీద చేయాలని నిర్ణయించారు.  

 ఈ సమావేశం లో తీసుకొన్న నిర్ణయాలు .

1. తేది 11.2.2024 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆయా సంఘాలు మరియు బాధ్యులు జూమ్ మీటింగ్ నిర్వహించుట.

2. తేది 12.2.24 సోమవారం అన్ని పాఠశాల / కళాశాలలో బ్లాక్ బడ్జెస్ ధరించి డ్యూటీస్ అటెండ్ అయి స్థానిక పత్రికలలో సమస్యలు వచ్చే విధంగా ఏర్పాటు ఆయా బాధ్యులు నిర్వహించాలి.

3. తేది 13.2.24 రోజు మంగళ వారం ఉదయం ఆరు గంటల వరకు జ్యోతి బాపులే ప్రజభవన వద్దకు అందరూ ఉపాద్యాయులు తప్పక పెద్ద ఎత్తున రావాలి. సీఎం గారికి సమస్యల సమర్పణ పత్రాలు సమర్పించాలి.

4. తదుపరి కార్యాచరణ మంగళ వారం నిర్ణయించ బడుతుంది. 

5. ప్రతి రోజు ఆయా సంఘాల బాధ్యులు జూమ్ మీటింగ్ నిర్వహించి సభ్యుల సందేహాలు తీర్చాలి.

6. ఇప్పుడు సమావేశం లో పాల్గొన్న సంఘాలతో పాటు మిగిలిన అన్ని సంఘాలు కూడా కలిసి రావాలి అని కోరుతూ తీర్మానం చేయటం జరిగింది. 

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ, ఉద్యోగులు హాజరు అయి విజయవంతం చేసి మన  సంఘటిత శక్తిని చూపించాలి అని విజ్ఞప్తి చేయుచున్నాము.

 *ప్రధాన సమస్యలు.* 

1. ప్రభుత్వ వివిధ గురుకుల ( ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ, జనరల్) పనిచేస్తున్న సుమారు 20000 ( ఇరవై వేల ) ఉపాధ్యాయుల ప్రమోషన్స్ , బదిలీలు అనంతరం నూతన నియామకాలు చేపట్టాలి.

2. జీవో 317 ను తక్షణమే పరిష్కారం చేయాలి.

3. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మేస్ చార్జెస్ పెంచాలి.

4. అన్ని గురుకుల సంస్థలను ఒకే యాజమాన్యం క్రిందికి తెచ్చి ప్రతి ప్రభుత్వ జీవో ను తప్పకుండా అమలు చేయాలి. 

5. అన్ని గురుకుల సంస్థలకు ఓకే కాల నిర్ణయం పట్టిక మరియు ఓకే స్టాఫ్ పాటర్న్ ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. బీసీ సొసైటీ లో కాల నిర్ణయ పట్టిక అన్ని సొసైటీ ల మాదిరి మార్పు చేయాలి. 

6.  గురుకుల ఉపాధ్యాయులకు  ప్యారోటి స్కేల్స్ వర్తింప చేయాలి.

7. డైరెక్ట్ రికరూట్మెంట్ ద్వారా నియామకం పొందిన వారికి పే మరియు సర్వీస్ ప్రోటెక్షన్ అమలు చేయాలి. 

8. హాలిడే డ్యూటీస్ కు ప్రత్యామ్నాయం వీక్లీ హాఫ్ ఇవ్వాలి.

9. అన్ని డిగ్రీ కాలేజీ లలో ఏవో పోస్ట్ నియమించాలి.

ఈ సమావేశాన్ని విజయవంతం చేయుటకు అన్ని సంఘాలు, వివిధ పాఠశాలల బాధ్యులు కృషి చేయాలని విజ్ఞప్తి.

ఈ సమావేశం లో పాల్గొని అంగీకారం తెల్పిన సంఘాలు బాధ్యులు.

1. మామిడి నారాయణ, మధు సుధన్ అధ్యక్షులు, కార్యదర్శులు  టిగారియ సెంట్రల్ యూనియన్.

2. వి వి కృష్ణా రెడ్డి, వి  ప్రభుదాస్ అధ్యక్షులు కార్యదర్శులు   స్టాఫ్ అసోసియేషన్.

3. పి రుషికేశ్ కుమార్, శ్రీమతి కల్యాణి  అధ్యక్షులు  కార్య దర్ష్యులు,   టీ టీ ఆర్  ఈ ఐ టి ఎ.

4. దామోదర్, సత్యం కార్య దర్షులు అధ్యక్షులు ట్రీస్.

5.  కె వి చలపతి , పి.  వివేకానంద అధ్యక్షులు  కార్యదర్శులు ప్రిన్సిపాల్ అసోసియేషన్ .

6. శ్రీమతి   సీ హెచ్ శారద, శ్రీమతి   సత్య శ్రీదేవి అధ్యక్ష కార్యదర్శులు డిగ్రీ కాలేజ్ యూనిట్    టిగారియా .

7. నర్సింలు గౌడ్, గణేష్  అధ్యక్ష కార్యదర్శులు  ఎస్సీ సొసైటీ.

8. ఎస్. శ్యాం కుమార్ , ముతయ్యా టీ గురుకులం. 

9. వేదాంత చారీ అధ్యక్షులు స్పెషల్ టీచర్స్ .





TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top