*ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే* ...
*ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు*
- మహాత్మగాంధీ
*ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే* ...
*పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు* - నెహ్రూ
*మరిచిపోకుండా నా సమాధి పైన రాయండి*
*ఇక్కడ పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు*
- ఫెడ్రంట్ రసెల్
*మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు*
- ఆల్బర్ట్ ఐన్స్టెయిన్
*ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు*
- నెల్సన్ మండేలా
*తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం అన్నారు*.
*పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు* ...
*పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి పడ్డాయంటా కానుకగా.....*
- ఆ వ్యక్తి ..... లెనిన్ !!
*ఒక్కో చిత్రం నటించగా తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు*
- చార్లీ చాప్లిన్
*ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే పుస్తకమే అన్నారు*
- విన్స్టెన్ చర్చిల్
*భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు* - మార్టిన్ లూతర్ కింగ్
*తనకు ఉరివేసే క్షణం ముందు వరకు ..... పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి*
- భగత్ సింగ్
*నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసిన వ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు* - అబ్రహం లింకన్
*వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి అతడే నా మార్గదర్శి అన్నారు* - జూలియస్ సీసర్
*ప్రపంచ పటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా ? అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు* - టెస్కార్డ్స్
*జీవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు*
*ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు*
- ఇంగర్సాల్
*వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో* .....
*అలా పుస్తక పఠనం మనసుకు వ్యాయామం, ఆరోగ్యం అన్నారు* - సిగ్మెంట్ ఫ్రాయిడ్
*పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు*.
*ప్రముఖులెందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే*.
*ముఖ పుస్తకం (facebook) పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము*.