Search This Blog

Sunday, December 17, 2023

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .

 1 . తల్లి - మనల్ని ఈ లోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  తల్లి మొదటి అద్భుతం. 

 2 . తండ్రి - మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీ ళ్లను దాచేస్తాడు.మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.....

 3 . తోడబుట్టిన  వాళ్ళు - మన తప్పులను వెనుకెసుకు రావా డానికి...  మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... తోడబుట్టినవాళ్లు 

4 . స్నేహితులు  - మన భావాలను పంచుకోడానికి..  మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి… ఏది ఆశించకుండా..  మనకు దొరి కిన స్నేహితులు  నాలుగో  అద్భుతం....

 5 . భార్య / భర్త - ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎది రించేలా  చేస్తుంది.కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూ పిస్తుంది .....భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భు తం మన సొంతం .

 6 . పిల్లలు - మనలో స్వార్థం మొదలవుతుంది..  మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  వారి ఆలో చనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది..  వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయ ని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  పిల్లలు ఆరో అద్భుతం.

 7 . మనవళ్ళు మనవరాళ్లు - వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బత కాలనే  ఆశపుడుతుంది.. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం.వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం....

ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతు కుతుంటాం... కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మ న సొంతం అవుతాయి. చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం …  ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి హాయిగా జీవించడం లోనే ఆనందం. ✍  _.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top