Search This Blog

Sunday, December 17, 2023

ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న పెన్షనర్స్ దినోత్సవం గా 1983 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్రాంత ఉద్యోగులందరికీ "పెన్షనర్స్ డే" శుభాకాంక్షలు





ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు "D.S నకారా".. ఈరోజు పెన్షనర్లందరూ పెన్షన్ తీసుకుంటూ వృద్ధాప్యంలో హాయిగా జీవిస్తున్నారంటే వీరే కారణము.. ఒకసారి వివరాలలోకి వెళదాము. D.S నకారా గారు. ఇండియన్ డిఫెన్స్ సర్వీసులో ఫైనాన్స్ అడ్వైజర్ గా ఉద్యోగం చేస్తూ.. 1972లో రిటైర్ అయిపోయినారు.. పెన్షన్ సిస్టం బ్రిటిష్ వారు అమలులోకి తెచ్చినప్పటికీ కొన్ని కారణాల వలన స్వాతంత్ర్య అనంతరం ఆగిపోయింది.. అప్పుడు నకారా గారు నేను దేశానికి ఎంత సేవ చేసాను కాబట్టి వృద్ధాప్యంలో నేను జీవించడానికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సిందేనంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగినది.. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడం జరిగినది.. వాదనలు ముగిసిన తర్వాత.. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లెజెండరీ జస్టిస్ వైబి చంద్ర చూడ్.. గారు డిసెంబర్ 17 1982 సంవత్సరంలో పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని, ప్రభుత్వం పెట్టే బిక్ష కాదని చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగినది... అందుకే ఈ తీర్పును "మాగ్నా కార్టా"ఆఫ్ పెన్షనర్స్ గా.. చరిత్రకెక్కినది.. ఆ మహనీయుడు ఆరోజు చేసిన కృషి ఫలితంగా నేడు విశ్రాంత ఉద్యోగులందరూ సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు గమనించారండి ఈ వ్యక్తి కూడా నాకెందుకులే అని అనుకుని ఉంటే.... ఎవరో ఒకరు వారే పోరాడతారులే అని అనుకుని ఉంటే.. ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో.. అందుకే కారల్ మార్క్స్ అంటాడు "పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని". అందుకే నకారా గారు చేసిన పోరాటం చరిత్రకెక్కినది.. ఒక హీరోగా నిలబెట్టినది.. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న పెన్షనర్స్ దినోత్సవం గా 1983 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్రాంత ఉద్యోగులందరికీ "పెన్షనర్స్ డే" శుభాకాంక్షలు తెలియజేస్తున✍🏻

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top