Search This Blog

Thursday, October 19, 2023

సందేహాలు☀️సమాధానాలు*

*సందేహాలు☀️సమాధానాలు* 

1.ప్రశ్న:
*భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు. ఒకరు రిటైర్మెంట్ అయ్యారు. పెన్షన్ వస్తుంది. రెండవ వారు మరణించిన వారి వారసులకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారా?*

జవాబు: *మెమో.3548 ; GAD; తేదీ: 24.3.12 ప్రకారం ఒకరికి పెన్షన్ వచ్చుచున్నందున కారుణ్య నియామకం వర్తించదు.*
~~~~
2.ప్రశ్న:
*ఒక మహిళా ఉద్యోగికి వివాహం కోసం డబ్బులు ఏమైనా అప్పుగా ఇస్తారా?*

జవాబు:
*జీఓ.39 ; ఆర్థికశాఖ; తేదీ: 15.4.15 ప్రకారం 75000/- అప్పుగా ఇస్తారు. దీనిని 70 వాయిదాలలో తిరిగి చెల్లించాలి. ప్రస్తుతం ఈ అమౌంట్ ను పెంచారు*
~~~~
3.ప్రశ్న:
*ప్రత్యేక ఆశక్తత సెలవులో ఉన్న వారికి జీతభత్యాలు ఎలా చెల్లించాలి?*

జవాబు:-
*120 రోజుల వరకు పూర్తి జీతం, మిగిలిన కాలానికి సగం జీతం చెల్లిస్తారు.*
~~~`
4.ప్రశ్న:
*కమ్యూటెడ్ సెలవును హాఫ్ పే లీవ్ గా మార్చుకోవచ్చా?*

జవాబు:
*జీఓ.143 తేదీ: 1.6.68 ప్రకారం వీలులేదు.*
~~~~~
5.ప్రశ్న;
*బీసీ క్రిమిలేయర్ పరిధిలోకి ఎవరు వస్తారు?*

జవాబు:-
*కేవలం గ్రూప్--I & II సర్వీసులో ఉన్న ఉద్యోగులు మాత్రమే వస్తారు. టీచర్లు క్రిమిలేయర్ పరిధిలోకి రారు మరియు 6 లక్షల ఆదాయం కలిగిన బీసీ ఉద్యోగులందరూ క్రిమిలేయర్ పరిధిలోకి రారు.*
~~~~~
6.ప్రశ్న : 
*PF ఋణం ఎంత ఇస్తారు?తిరిగి ఎలా చెల్లించాలి?*

జవాబు:
*PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణం కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.*
~~~~~
7.ప్రశ్న:-
*నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది?*

*జవాబు:-మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒకసారి పదోన్నతి తిరస్కరించవచ్చు. ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారం* 
*మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు*
~~~~~
8.ప్రశ్న:
*సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి?*

జవాబు:
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి. ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*
~~~~~
9.ప్రశ్న:-
*ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా?*

జవాబు:-
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నం.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*
~~~~~
10.ప్రశ్న:
*LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి?*

జవాబు:
*LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి. 50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.*
~~~~
11.ప్రశ్న: 
*UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలంనకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?*

జవాబు: 
*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.*
~~~~
12.ప్రశ్న: 
*SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?*

జవాబు: 
*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసులో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*
~~~~~
13.ప్రశ్న: 
*మహిళా టీచర్ భర్త నిరుద్యోగి. అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు. అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు. మెడికల్ రీయింబర్సుమెంట్ వర్తిస్తుందా?*

*జవాబు: APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ, నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*
~~~~
14.ప్రశ్న: 
*నాకు మొదటి సారి అమ్మాయి. తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా?*

*జవాబు: జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.*
~~~~
15.ప్రశ్న: 
*అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు. వాస్తవమా? కాదా?*

జవాబు: *జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు. అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.*
~~~~
16.ప్రశ్న: 
*ఉన్నత విద్య కోసం DEO అనుమతి తో డెప్యూటషన్ లో ఉన్న SC, ST టీచర్స్ కు AGI మంజూరు చేయవచ్చా?*

జవాబు:
*మంజూరు చేయవచ్చు.*
*GO. no.342 dt:30.08.1977 ద్వారా ఉన్నత విద్య కోసం ఇచ్చిన డెప్యూటషన్ కాలం onduty గానే పరిగణిస్తారు*
~~~~
17.ప్రశ్న:
 *సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చు ?*

జవాబు: 
*సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు  అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.*
*(G.O.Ms.No122 తేది:11-04-2016)*
~~~~
 18.ప్రశ్న: 
*మరణించిన ఫ్యామిలి మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చు ?*

జవాబు: 
*మరణించిన ఫ్యామిలి మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.30,000 ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు.  పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు. (G.O.Ms 65 తేది: 22-06-2023)*
 *ఫ్యామిలి పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచే వారసులకు చెల్లిస్తారు.*
~~~~
 19.ప్రశ్న : 
*కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వరిస్తుందా ?*

జవాబు: 
*వర్తించును. అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.*
*(G.O.Ms.No.87 తేది:28-02-2004)*
~~~~
 20.ప్రశ్న : 
*ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు ?*

జవాబు : 
*ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు  నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.*
*(G.O.Ms.No.38 తేది:28-05-2013)*
~~~~
21.ప్రశ్న : 
*ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?*

జవాబు: 
*వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  Cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా) తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు*
~~~~
22.ప్రశ్న: 
*నేను జులై 14 న ఉద్యోగంలో చేరాను. ఇంక్రిమెంట్ నెల జులై. నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను. పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి?*

జవాబు: 
*జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు. కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.*
~~~~
23.ప్రశ్న: 
*నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను. ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు. వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?*

జవాబు: 
*FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారం CSE గారికి మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.*
~~~~
24.ప్రశ్న: 
*డైస్ నాన్ కాలం అంటే ఏమిటి?*

జవాబు: 
*FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి. తిరిగి ఉద్యోగంలో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.*
*FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు. కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటం, వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.*
~~~~
25.ప్రశ్న: 
*అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను. నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు. నా ఉద్యోగం తమ్ముడుకి ఇప్పించవచ్చునా?*

జవాబు: 
*టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.*
*కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహించలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.*
~~~~
26.ప్రశ్న:
*నేను, నా భార్య ఇద్దరం టీచర్లం. హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా?*

జవాబు:
*చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.*
~~~~
27.ప్రశ్న: 
*EOL కాలాన్ని వాలంటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా?*

జవాబు: 
*EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.*
*కానీ వ్యక్తిగత కారణాల తో EOL ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా EOL కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.*
~~~~
28.ప్రశ్న:
*నేను HM గా పనిచేస్తున్నాను. అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. పరిస్థితి ఏమిటి?*

జవాబు: 
*FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది. కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు. ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి. SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.*
~~~~
29.ప్రశ్న: 
*నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..?*

జవాబు: 
*మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*
*GO MS No:262, Dt:25-8-1980.*
~~~~
30.ప్రశ్న: 
*వేసవి సెలవులలో ఎంఇఓ కార్యాలయంలో సర్వీసు రిజిష్టర్, బిల్లులు చేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు వస్తుందా?*

జవాబు: 
*బిల్లులు, ఎస్ఆర్ ల బాధ్యత ఉపాధ్యాయులది కాదు. కాని వేసవి సెలవులలో మీ ఎంఈవో  ఆ విధమైన డ్యూటీ చేయమని ఉత్తర్వులు ఇస్తే.,*
*జీవో 35; తేదీ. 16.01.1981  ప్రకారం మీకు సంపాదిత సెలవు జమచేయవలసి ఉంటుంది.*
~~~~
31.ప్రశ్న: 
*హైస్కూల్ ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తే హెచ్ఎం అలవెన్స్ ఇస్తారా?*

జవాబు: 
*ఎఫ్ఆర్ 49 ప్రకారం ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయుడిగా 15 రోజులు అంతకన్నా ఎక్కువ కాలం పనిచేస్తే ఎఫ్ఏసి అలవెన్స్ మంజూరు చేయబడుతుంది.*
~~~~
32.ప్రశ్న: 
*ఒకే డీఎస్సీకి చెందిన A, Bఅను ఇరువురు ఉపాధ్యాయులలో A అను ఉపాధ్యాయుడు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పదోన్నతి రిలింక్విష్ చేశారు, B పదోన్నతి స్వీకరించారు.  తదుపరి  A   పదోన్నతి పొందారు., B ఉపాధ్యాయుడు A ఉపాధ్యాయుడితో  స్టెప్ అప్ పొందవచ్చునా?*

జవాబు: 
*అవకాశం లేదు.  సీనియర్ అయిన ఉపాధ్యాయుడు ప్రస్తుత కేడర్ లో మరియు ఫీడర్ కేడర్ లో రెండింటిలోను సీనియర్ అయివుండాలి.*
~~~~
33.ప్రశ్న: 
*ఏ.పీ.జి.ఎల్.ఐ  పెంపుదలకు ఏ సర్టిఫికెట్లు జతచేయాలి. ఎంత వరకు పెంపుదల చేసుకోవచ్చు.*

జవాబు: *మూలవేతనంలో  20% వరకు పెంపుదల చేసుకోవచ్చు. మీ మూలవేతనం ప్రకారం చెల్లించవలసిన మొత్తం చెల్లించేటట్లయితే ఎలాంటి సర్టిఫికెట్లు జతపరచనవసరం లేదు. అంతకుమించి పెంచుకొనేటట్లయితే "గుడ్ హెల్త్ సర్టిఫికెట్" జతచేయవలసి ఉంటుంది.*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top