తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో వెంటనే బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని సంస్థ కార్యదర్శి Dr. నవీన్ నికోలస్ గారికి సంస్థ ప్రధాన కార్యాలయము తెలుగు సంక్షేమ భవన్ మాసబ్ ట్యాంక్ నందు కలిసి వినతిపత్రం సమర్పించి న వారు శ్రీ అలగోని నరసింహులు గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు,
B.బిక్షం యాదవ్ ప్రధాన కార్యదర్శి ఎస్ .గణేష్ కోశాధికారి మరియు (టిగారియా) Telangana Government All Residential Institutions Employees Association సంఘ సభ్యులు కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. నాలుగో తరగతి సిబ్బంది , ఉపాధ్యాయులుమరియు RC ల వరకు బదిలీలు చేపట్టాలని చాలాకాలంగా బదిలీలు లేక ఉద్యోగులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని అలాగే ప్రమోషన్లు కూడా వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేశారు.
👉 50 స్కూళ్లలో ఒక పీజీటీ మ్యాథ్స్ పోస్టును పిజిటి హిందిగా కన్వర్ట్ చేస్తూ గతంలోఉత్తర్వులు ఇవ్వడం జరిగింది . దీనివల్ల TGT Maths cader నందు 50 మంది పిజిటి cader గణితంలో ప్రమోషన్ పొందడానికి అవకాశం కోల్పోయారు .భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ యందు పిజిటి గణితం టీచర్లు సెకండ్ పిజిటి గణితం పోస్టును ఆప్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది .భవిష్యత్తులో చేయబోయే బదిలీల్లో రెండు పీజీటీ మాథ్స్ పోస్టులనుప్రతి పాఠశాలలో భర్తీ చేయాల్సిందిగా ఇట్టి విషయాన్ని గౌరవ సెక్రటరీ దృష్టికి టిగారియా సంఘ బాద్యులు తీసుకురావడం జరిగింది .గౌరవ కార్యదర్శి గారు ఈ సమస్యపై పరిశీలించి నిర్ణయం
తీసుకోవడం జరుగును అని పేర్కొనడం జరిగినది.