*💠రోజూ 4 వేల అడుగులు వేయండి..💠*
*🔶2 వేల 337 రోగాలు మాయం*
*🍥ప్రతీ రోజూ ఎంత సేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది అంటే..నిపుణులు..డాక్టర్లు అయితే..ప్రతీ రోజూ 6 వేల అడుగుల నుంచి..10 వేల అడుగుల వరకు అని చెప్తారు. కానీ ఒక అధ్యయనం ప్రకారం..రోజుకు కేవలం 4 వేల అడుగులు నడిస్తే వివిధ కారణా వల్ల మరణించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అదే రోజుకు కనీసం 2,337 అడుగులు నడిస్తే గుండె సంబంధిత వ్యాధుల ద్వారా మరణించే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి రోజు ఎంత ఎక్కువ సేపు నడిస్తే..అంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనం ఉంటుందని అధ్యయనం తేల్చింది.*
*💥రోజు ఎంతసేపు నడవాలంటే..*
*🌀పోలాండ్ లోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ లాడ్జ్ లోని పరిశోధకులు ప్రజలు ప్రతీ రోజూ ఎంత సేపు నడవాలన్న దానిపై దశల వారీగా పరిశోధనలు చేశారు. కార్డియాలజీ ప్రొఫెసర్ మాసీజ్ మనాచ్ నేతృత్వంలోని పరిశోధకులు గతంలో వివిధ దేశాల్లో చేసిన 17 ఆధ్యయనాల్లో పాల్గొన్న 2 లక్షల 26 వేల 889 మంది నుంచి డేటాను సేకరించారు. ఈ అధ్యయనం ప్రకారం రోజుకు 3967 అడుగులు వేయడం వల్ల ఏదైనా కారణాల వల్ల సంభవించే మరణాన్ని తగ్గించుకోవచ్చు. రోజుకు 2337 అడుగుల వరకు నడవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ద్వారా మరణించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే రోజుకు 1000 అడుగులు వేయడం ద్వారా ఏదైనా కారణాల వల్ల చనిపోయే ప్రమాదాన్ని 15 శాతం తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు. రోజుకు 500 అడుగులు వేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 7 శాతం తగ్గుతుంది. రోజుకు కనీసం 5వేల అడుగులు నడిచే వారు..ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంది.*
*💠పోలాండ్ మెడికల్ వర్సిటీ అధ్యయనం ప్రకారం..ప్రతీ రోజు 7000 నుంచి 13000 అడుగులు వేసే వ్యక్తులలో చిన్న వయసులో ఉన్న వారి ఆరోగ్యం మరింత మెరుగ్గా తయారవుతుందని తేలింది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు ఒక రోజులో 6000 నుంచి 10,000 అడుగులు వేస్తే వారు మరింత ఆరోగ్యవంతులుగా మారతారట. అంతేకాదు వారిలో మరణం శాతం 42 వరకు తగ్గుతుందట. ఇక రోజుకు 20 వేల అడుగులు వేసినా లేదా కనీసం 14 నుంచి 16 కిలో మీటర్లు నడిచినా..ఆరోగ్య ప్రయోజనాలు పెరుగాయని పరిశోధనలు తేలింది.*