*నాన్న..!*
*“నాన్న” అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు.*
*నాన్న చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో...*
*ఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో ’నాన్న.. నాన్న.. నాన్న’ అని మూడు సార్లు పిలవమంటారు.*
*కొడుకు రెండు సార్లు బాగానే పిలుస్తాడు..!*
*మూడోసారి మాట రాదు. గుండెలో బాధ , గొంతులో తెలియని నొప్పి , కళ్ళల్లో నీళ్ళు.*
*ఎందుకంటే...ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి.*
*ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు.!*
*ఆ పిలుపు తనకి Just Half Second మాత్రమే పట్టింది...!*
*కానీ...*
*ఆ Half Second లో వాడికి మొత్తం కళ్ళముందు కనిపించేది..మాత్రం...*
*“మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది!*
*మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్ కి వెళ్ళకుండా మన Future కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి.*
*చివరగా ఎవరైనా ‘నువ్వు ఏం సంపాదించావురా?’ అని నాన్న ని అడిగేతే...’నా ఆస్తి నా కొడుకురా!’ అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది!“*
*ఇవ్వన్నీ కనిపించిప్పుడు నాన్న ని గట్టిగా హత్తుకుని “నాన్న నాన్న నాన్న నాన్న నాన్న నాన్న” అని పిలవాలని అనిపిస్తుంది.*
*కాని...అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా... అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు.*
*So నాన్న ఉన్నప్పుడే తనని “నాన్న” అని ప్రేమగా పిలుద్దాం…!*
*నాన్న పోయాక ఆయన ఫోటో దగ్గర కూర్చుని బాధపడే బదులు....*
*నాన్న ఉన్నపుడే తనతో రోజూ కొంత టైం గడుపుదాం!*
*ఆయన పోయాక FB లో “my dad is my hero” అనే post లు పెట్టే బదులు... నాన్న ఉన్నప్పుడే నాన్న తో “నాన్న U are my hero” అని చెప్పుదాం.*
*అంత గొప్ప “నాన్న”అనే పదాన్ని కించపరచకండి.*
*“తన జీవితాన్ని ఖర్చుపెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న!*
*మారండి మారటానికి ప్రయత్నించండి!మన తల్లి-తండ్రులను సుఖఃసంతోషాలతో ఉండేలాగా చేద్దాము!*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*