అందమైన పలువరస ముఖానికే అందాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అంతమైన నవ్వు ఎప్పటికీ సొంతం కావాలంటే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన దంతాలు ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. దంతాల ఆకారం లేదా రంగులో ఏదైనా మార్పు వస్తే అది మన ముఖంలో తప్పకుండా కనపిస్తుంది. అది అందాన్ని పాడు చేస్తుంది. తెల్లని, ముత్యాల దంతాలను ఎవరు ఇష్టపడరు? కొన్నిసార్లు, సరైన ఆహారపు అలవాట్లు లేని కారణంగా, దంతాల మీద పసుపు పొర పేరుకుపోతుంది, దీనిని టార్టార్ అంటారు.
టార్టార్ అనేది ఆహారం, పానీయాలతో తయారయ్యే పసుపు పొర, ఇది నెమ్మదిగా దంతాలకు అంటుకుంటుంది. ఇది నెమ్మదిగా చిగుళ్ల మూలానికి చేరుకుని వాటిని బోలుగా మారుస్తుంది. దీని వల్ల దంతాలు పసుపు గారపట్టి రంగు మారుతాయి, అలాగే నోటి దుర్వాసన, చిగుళ్లలో రక్తస్రావం, దంత క్షయం, పైయోరియా నొప్పి వంటి దంత సమస్యలు వస్తాయి.
పసుపును తెల్లగా చేయడం ఎలా?
రోజూ బ్రష్ చేసినా, ఖరీదైన టూత్ పేస్టు వాడినా చాలా మంది దంతాలు పసుపు రంగులోనే ఉండడం గమనిస్తూ ఉంటాం. ఈ సమస్యతో పోరాడుతున్నట్లయితే, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడమే కాకుండా, ఈ చిట్కాలను పాటించండి.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల నుండి మొండి పసుపు పొరను తొలగించడంలో ఇవి సహాయపడతాయి.
బేకింగ్ సోడా..
ఒక అధ్యయనం (Ref) ప్రకారం, బేకింగ్ సోడా దంతాల పై మరకలను తొలగించడంలో సహాయపడుతుంది, అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడే సహజ బ్లీచింగ్ ఏజెంట్. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోండి. రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమంతో దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయడానికి ఈ పేస్ట్ ఉపయోగించండి.
ఆయిల్ పుల్లింగ్..
ఆయిల్ పుల్లింగ్ భారతదేశంలో దంతాలను తెల్లగా మార్చే సంప్రదాయ పద్ధతి. ఇది మొత్తం నోటి నొప్పిని శుభ్రపరుస్తుంది. ఆయిల్ పుల్లింగ్ చేయడానికి, నోటిలో నూనె తీసుకొని చుట్టూ తిరగాలి. దీని కోసం పొద్దు తిరుగుడు నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఉపయోగించండి. ఆయిల్ పుల్లింగ్ చేయడానికి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు నోటిలో Swish (పుక్కిలించడం) చేయండి.
అరటి, నిమ్మ ఉపయోగించి..
అరటిపండు, నారింజ, నిమ్మకాయ తొక్కను తీసుకుని దంతాల మీద మెత్తగా రుద్దండి. సుమారు 2 నిముషాల పాటు రుద్దుతూ ఉండండి, తరవాత నోటిని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు బ్రష్ చేయండి. ఈ పండ్ల తొక్కలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అది దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
ఎక్కువ పండ్లు, కూరగాయలు తినండి.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల నుండి మొండి పసుపు పొరను తొలగించడంలో ఇవి సహాయపడతాయి. పండ్లలో పైనాపిల్, స్ట్రాబెర్రీ తింటే మంచిది. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మరకలను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఎన్ని మార్పులు చేసినా దంతాలు మరింత పసుపు రంగులోకి మారుతున్నట్లయితే, ఈ విషయంలో దంతవైద్యుని సంప్రదించడం మంచిది.