Search This Blog

Thursday, May 25, 2023

Triple Filter Test

ఒక సారి చాణక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి.నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీన్ని నేను 'మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)' అంటాను" అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ “నిజం”: “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు “లేదు ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ “మంచి:” 
” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా?” అని అడిగాడు చాణక్యుడు.
“కాదు” అన్నాడు చాణక్యుని స్నేహితుడు.

“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు.అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం". 

"సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం” అన్నాడు చాణక్యుడు.

మూడో జల్లెడ “ఉపయోగం” : 
“నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా? ” అని చాణక్యుడు అడిగాడు.
“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.

“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకర మైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణక్యుడు.

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసేవాళ్ళు చాలా మంది వుంటారు.ఒక విషయం (చాడి) వినే ముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే,మన బంధాలు నిలబడతాయి మంచి పెంపొందుతుంది. 

"చాడీలు" నివారించ బడతాయి.

*స్నేహాo విలువ తెలిసిన వారికి మాత్రమే*🙏

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top