🙏🏻ఓం నమో వేంకటేశాయ 🙏🏻
👏తిరుమల శ్రీ వారి సేవలో పాల్గొనాలంటే on line లో ఎలా book చేసుకోవాలి, ఎప్పుడు వీలుగా వుంది, on line aap పేరు పంపండి , ఎవ్వరైనా మిత్రులు పంపండి👏
*General Srivari Seva Instructions*
*శ్రీవారి సేవ చేద్దాం శ్రీవారి శుభాశీస్సులు పొందుదాం.*
*మానవునిగా జన్మ ఎత్తినపుడు మాధవుని (శ్రీవారి) సేవ*
*నరుడిగా జన్మ ఎత్తినపుడు నారాయణుని (గోవిందుని దర్శనం)*
ఇదేలా సాధ్యం ?
*పై రెండు 👆👆👆 తిరుమలలో శ్రీవారి సేవతోనే సాధ్యం*
*శ్రీవారి సేవ ఎన్ని రోజులు చేయొచ్చు?*
1) *తిరుమలలో శ్రీవారి సేవ*
7 days (ప్రతి మంగళ వారం నుండి సోమవారం వరకు)
7 days (ప్రతి బుదవారం నుండి మంగళవారం వరకు)
2) *తిరుపతి శ్రీవారి సేవ*
A) 7 days (ప్రతి మంగళవారం నుండి సోమవారం వరకు 7 రోజులు)
B) 7 Days ప్రతి శుక్రవారం నుండి గురువారం వరకు 7 రోజులు)
*తిరుపతి శ్రీవారి సేవను తిరుపతిలో 3 లేదా 4 రోజులు మరియు మిగతా 3 లేదా 4 రోజులు తిరుమలలో శ్రీవారి సేవ చెయ్యాలి.*
*వయస్సు ఎంత ఊండాలి?*
*7 days సేవ చేయాలనుకునే వారు తప్పని సరిగా 18-60 మద్య వయస్సు ఉండి తీరాలి.*
*Individual గా లేదా group తో చెయ్యాలా?*
7 రోజుల సేవను వ్యక్తిగతంగా ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు చేయవచ్చు . Group లేదా Team గా అంటే (10 మంది సేవకులకు తక్కువ కాకుండా 15 మంది సేవకులకు ఎక్కువ కాకుండా) చేయవచ్చు .
*ఎవరెవరు చేయవచ్చు?*
దీనికి నిబందన ఏమి లేదు కాని హిందూ మతానికి చెందిన వారై యుండాలి. ప్రభుత్వ ఉద్యోగస్థులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారస్థులు, గృహిణులు, విద్యార్ఠులు ఇలా ఎవరైనా చేయవచ్చు.
*ఎక్కడ రిపోర్ట్ చెయ్యలి?*
తిరుమలలో ఉన్న New Seva Sadan-2 (Opposite Sri Varaha Swamy Guest House) లో
*తిరుమల శ్రీవారి సేవ (7 రోజుల సేవ) ఉన్నవారు అంటే*
*బుధవారం నుండి సేవ ఉన్నవారు (తిరుమల శ్రీవారి సేవ) బుధవారం రిపోర్ట్ చెయ్యాలి.*
*మంగళ వారం నుండి సేవ ఉన్నవారు (తిరుమల శ్రీవారి సేవ) మంగళ వారం రిపోర్ట్ చెయ్యాలి.*
*తిరుపతి శ్రీవారి సేవ (7 రోజుల సేవ) ఉన్నవారు అంటే*
*మంగళ వారం నుండి సేవ ఉన్నవారు మంగళ వారం నాడు SEVA SADAN - – VISHNU NIVASAM, OPP: RAILWAY STATION, TIRUPATHI లో రిపోర్ట్ చెయ్యాలి.*
*శుక్ర వారం నుండి సేవ ఉన్నవారు శుక్ర వారం నాడు SEVA SADAN – VISHNU NIVASAM, OPP: RAILWAY STATION, TIRUPATHI లో రిపోర్ట్ చెయ్యాలి.*
*ఏ ఏ పత్రాలు (Documents) సమర్పించాలి?*
1) మనకు T.T.D. వారు confirm చేసిన Confirmation Letter (Individual or Team / Group)
2) Original Aadar card (Reporting Counter లో చూయించాలి)
3) Aadar Zerox copy (జత పరచాలి)
*T.T.D. వారు ఏమి ఇస్తారు?*
1) Srivari Seva Duty Identity Card
2) Scarf of Srivari Seva
3) Locker and Accommodation
4) Tiffins and meals
5) శ్రీ వేంకటేశ్వరుని దర్శనం మరియు ప్రసాదం (1 లడ్డు) ఇది సేవ పూర్తయిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
*Dress code:-*
*పురుష (మగ) సేవకులు తెల్లని లుంగీ / ధోతి / ప్యాంటు మరియు తెల్లని చొక్క మరియు లాల్చి పైజామా ధరించాలి.*
(male volunteers should wear white shirt and white pant or vesti or kurta-pyjama)
*స్త్రీ (ఆడ) సేవకులు కాషాయం రంగు గల చీర మెరూన్ రంగు గల బ్లౌజ్*
(orange color saree with Maroon border and maroon colour blouse or orange colour chudidar with Maroon colour pyjama and chunni)
*వివరాలకు మరియు సందేహాలకు:*
సదా శ్రీవారి సేవలో
అనిల్ కుమార్ పబ్బతి
Ph 9440990493