అధిక రక్తపోటు..( High Blood Pressure ) చాలా మంది సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఊబకాయం, మధుమేహం( Diabetes ) తదితర కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుంటుంది, అధిక రక్తపోటు కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి, గుండె పోటు వచ్చే రిస్క్ భారీగా పెరుగుతుంది.
అందుకే రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఈ ఒక్క స్మూతీ డైట్ లో ఉంటే అధిక రక్తపోటుతో చింతే అక్కర్లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం రక్తపోటును అదుపులో ఉంచే ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక యాపిల్( Apple ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బీట్ రూట్ మరియు కీరా దోసకాయలను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు( Beetroot ), కీర దోసకాయ ముక్కలు, అర కప్పు పార్స్లీ ఆకులు, ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తద్వారా మన స్మూతీ సిద్దమవుతుంది. ఈ స్మూతీ హెల్త్( Healthy Smoothie ) కి చాలా మేలు చేస్తుంది. రోజులకు ఒకసారి ఈ స్మూతీని తయారు చేసుకుని తీసుకుంటే అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచడానికి ఈ స్మూతీ గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి. పైగా ఈ స్మూతీ వల్ల వెయిట్ లాస్ అవుతారు. కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. బాడీ డిటాక్స్ అవుతుంది. రక్తహీనత దూరమవుతుంది. మరియు చర్మం నిగారింపుగా, కాంతివంతంగా సైతం మెరుస్తుంది.