లెక్కలేనన్ని అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే..
కోవిడ్ తరువాత ఆరోగ్య విషయంలో ఎన్నో అపోహలు, అనుమానాలు, ఆచరణలు తప్పడం లేదు. ఇప్పటి వరకూ ఆరోగ్యం గురించి పట్టించుకోనివారు ఇప్పుడు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం చేస్తున్న వ్యాయామ పద్దతుల్లో నడక ఎంతవరకూ మనకు సపోర్ట్ ఇస్తుందనేది తెలియాలి. ఇందులో రోజులో అసలు ఎన్ని అడుగులు నడవాలి అనేది కూడా ముఖ్యమే. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు శారీరక శ్రమ లేకపోవడమే కారణం అంటూ చెప్పుకొస్తారు వైద్య నిపుణులు, అసలు రోజుకు 10 వేల అడుగులు నడవడం అనేది చాలామంది కరోనా టైంలో ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు మొదలైంది. అసలు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత వరకూ ప్రయోజం ఉంది?
మనలో చాలామంది కేలరీలు బర్న్ చేయడానికి నడకను ఎంచుకుంటారు. ఫిట్‌గా ఉండడానికి కూడా నడకనే ఎంచుకుంటారు. అయితే రోజుకు 10వేల అడుగులు వేయాలనే విషయంతో మనకు ప్రయోజనం ఉందా అంటే అదే తెలుసుకుందాం.
రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల..
నడక బరువు తగ్గడానికి చక్కని పరిష్కారంగా ఉంటుంది. అలాగే రోజుకు 10,000 అడుగులు నడవడం అంటే దాదాపు ఐదు మైళ్లు. 3,000 అడుగులు చురుకైన నడక, జాగింగ్ చేయడం వేగంతో బరువు తగ్గడానికి తగినంత కేలరీలు బర్న్ చేయడంలో మేలు చేస్తుంది. నడక మనసును ప్రశాంతంగా చేస్తుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, నడక మనస్సును తేలిక చేస్తుంది. ఆలోచనలను ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంటి నుంచి పనిచేసేవారు మధ్యాహ్నం, భోజన సమయంలో 20 నిమిషాల నడవడం వల్ల అది ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ఆందోళనను, నిరాశను తగ్గిస్తుంది.
నిద్ర రక్తపోటును మెరుగుపరుస్తుంది. బలమైన గుండె తక్కువ శ్రమతో ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. రక్తపోటు తగ్గుతుంది. నడక వల్ల మరింత చురుకుగా మారడమే కాకుండా సిస్టోలిక్ రక్తపోటు సగటున 4 నుండి 9 పాయింట్ల వరకు తగ్గుతుంది.
నడక రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గిస్తుంది. నడవడం వల్ల కండరాలు ఎక్కువ గ్లూకోజ్‌ని ఉపయోగించుకునేలా చేస్తాయి. నడక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లెక్కలేనన్ని అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే.. నడక హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుందని చెపుతుంది.
దీర్ఘకాలిక రోగులకూ నడక మంచిదే..
నడక మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ, దినచర్యలో నడకను చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. దీనికి సౌకర్యవంతమైన పాదరక్షలను ఉపయోగించాలి.
ఎవరు నడవకూడదు.
గాయాలతో ఉన్నవారు లేదా కీళ్ల సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో ఉన్నవారు నడిస్తే.. వైద్య పరమైన సమస్యలు తలెత్తుతాయి.