తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సచివాలయ భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ నమూనాకు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని ఓ వీడియోను విడుదల చేశారు. కొత్త సచివాలయ భవనం, భవనంలోని ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ప్రవేశ ద్వారాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లు, భవనం చుట్టూ నలువైపులా విశాలమైన రహదార్లు, కాంప్లెక్స్, గుడి, చర్చ, మసీదులు తదితరాల నమూనాను ఇందులో స్పష్టంగా చూపారు.