ఏకాగ్రత, శ్రద్ధ ఉంటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది
- తల్లిదండ్రుల చేతుల్లోనే పిల్లల భవిష్యత్
- ఒత్తిడి కన్నా మార్గం చూపాలి
- స్నేహితుడిలా సలహాలివ్వాలి
- ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ గణేశ్‌కుమార్
నవతెలంగాణ-భద్రాచలం
విద్యార్థుల్లో చదువుపై ఏకాగ్రత, శ్రద్ధ ఉంటేనే దానికదే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతోంది. పిల్లలు ఎదగాలంటే...వారేకాదు తల్లిదండ్రులూ జాగ్రత్తలు తీసుకోవాలి. పదేపదే పిల్లలను చదువా లని ఒత్తిడి పెంచుతారు. అది సరికాదు. ఎందుకు చదవలేక పోతున్నారో దృష్టి పెట్టాలి. ఎలా చదవాలో సూచించాలి. వారి ప్రవర్తన ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనించాలి. పిల్లలకు తల్లి దండ్రులు ఒక స్నేహితుడిలా సలహాలు ఇవ్వాలి' అంటున్నారు...ప్రముఖ ట్రైనర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ గణేష్‌కుమార్. భద్రాచలంలోని తానీషా కళ్యాణ మండపంలో పిల్లల్లో జ్ఞాపకశక్తి- అవసరమైన జాగ్రత్తల కోసం ఆయన గత రెండు రోజులుగా పిల్లలకు, తల్లిదండ్రులకు ఉచితంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయనను 'నవతెలంగా ణ' పలుకరించింది. ఆయన మాటల్లోనే....
ఒత్తిడి ఎవరిపై మంచిది కాదు...
తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే పిల్లలపై ప్రేమను పెంచుకుంటారు. అది కొన్నిసార్లు మనతో తప్పులు చేయిస్తుంది. పిల్లలపై ప్రేమతోపాటు వారికి క్రమశి క్షణను అలవ ర్చాలి. సక్రమమార్గం వైపు నడిపించడం అలవరిస్తే వారు అదే మార్గంలో నడుస్తారు. కొన్ని సందర్బాల్లో ఉపాద్యా యులు పిల్లలను అదుపులో ఉంచేం దుకు, చదవన ప్పుడు మందలిం చడమో, కొట్టడమో చేస్తుంటారు. దాన్ని కొందరు తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకుంటారు. చివరకు పోలీసుల వరకు వెళతారు. అది సరైందికాదు. గతంలో తల్లిదండ్రులు టీచర్ కొడితే నీవు చదవవు కాబట్టే కొట్టారు అనే తల్లిదండ్రలు ప్రస్తుత రోజుల్లో కరువయ్యారు. దీనివల్ల ఉపాధ్యాయులకు నేర్పించాలనే శ్రద్ధ పోతోంది.
పిల్లలపై మానిటరింగ్ ఉండాలి...
పిల్లలను స్కూల్లో చేర్పించి వదిలేస్తారు. సరే కారణాలు ఏమైనా అది సరైందికాదు. పిల్లల నిత్యం ప్రవర్తనను ఎప్పటికపుడు వారికి తెలియ కుండానే గమనించాలి. లేదంటే పిల్లలు చెడుదా రుల వెంట నడిచే ప్రమాదం ఉంటుంది. వారి ప్రవర్తనపై ఉపాద్యయులను అడిగి తెలుసుకో వాలి. ఎందుకంటే మనకన్నా వారికే ఎక్కువ తెలు స్తుంది. ఇంటికి వచ్చాక పిల్లల ప్రవర్తనను గమ నించాలి. సూచనలు, సలహాలు ఇవ్వాలి. లేదంటే ఉపాధ్యాయుల ద్వారా చెప్పించాలి. మంచిని కొంతకాలం నేర్పిస్తే పిల్లలు అదే దారిలో వెళతా రు. అలవాటైపోతుంది. తప్పు దారిలో వెళ్ళేందుకు భయపడతారు. ఈ జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాలి.
దృష్టి మళ్లించాలి....
పిల్లల దృష్టిని చదువు పైకి మళ్లించాలి. కొంతమంది పిల్లలు ఆటలపై మక్కువ పెంచుకుంటారు. టీచర్ బోధన చేస్తున్నా వారి దృష్టి అటువైపు కాకుండా ఆటలపైనే ఉంటుంది. అలాంటి పిల్లలకు కొత్త విషయాలను చెప్పి చదవుపై ఆసక్తి పెరిగేలా చేయాలి.
విద్యార్థులు చేయాల్సినవి...
విద్యార్థులు జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. చదువుపై పట్టు సాధిస్తేనే ఉన్నతస్థాయికి వెళ్తారు. డౌట్స్ ఉంటే వెంటనే టీచర్‌ను అడగాలి. అందరి ముందు అడిగితే అనే సందేహం ఉంటే ఒంటరిగానైనా టీచర్‌ను అడగాలి. లేదంటే అక్కడితోనే విధ్యార్థి భవిష్యత్‌కు బ్రేక్ పడుతోంది. ఉపాధ్యాయులు చెప్పిన క్లాస్‌ను తప్పనిసరిగా రివిజన్ చేసుకోవాలి. పాఠాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లు రాసుకోవాలి. ముందుగా నెగిటివ్ అలోచనలు దూరంగా పెట్టాలి. చదవగలనా లేదా? పరీక్షలు వచ్చేస్తున్నారు? ఇలా భయపడవద్దు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందవద్దు. ఎందుకు తక్కువ వచ్చాయో పున:పరిశలించుకోవాలి. వాటిని అధిగమించేలా సాధన చేయాలి.
నేటి నుండి ప్రత్యేక శిక్షణ....
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా? పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రుల సహకారం ఎలా ఉండాలి. అనే అంశాలతో కూడిన శిక్షణా కార్యక్ర మం భద్రాచలంలోని టూరిజం హౌటల్‌లోని కాన్ఫిరెన్సు హాల్‌లో ఐదు రోజులు శిక్షణ సోమవారం నుండి ప్రారంభమౌతోంది. స్వల్ప రుసుములతో అరుదైన అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ గణేష్‌కు మార్ తెలిపారు.
- Save