మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మాత్రమే అని మనము గ్రహించ గలము...
మనము బాల్యం లో ఉన్నప్పుడు, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మనతో సన్నిహితముగ ఆడుకున్న వారే.
ప్రతిరోజూ, మనము ఒకరిని ఒకరు వెంబడిస్తూ & సందడిగా ఉల్లాసంగా గడిపాము & కలిసి మంచి బాల్యాన్ని గడిపాము.
పెద్దయ్యాక, మనము మన స్వంత కుటుంబాలను కలిగిన తరువాత , మన స్వంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము & సాధారణంగా అరుదుగా కలుసుకుంటాము. మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ మన తల్లిదండ్రులు.
మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు మరియు మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య తగ్గిపోతుంది, అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది.
నేను ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక వీడియోను చూశాను, అందులో 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్లాడు.* *కొంత సమయం గడిపిన తర్వాత ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చెల్లెలు తన అన్న కారుని వెంబడించి, తన సోదరుడికి 200 యువాన్లు ఇచ్చి, తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తికాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్లు ఉండటం నిజంగా చాలా అదృష్టమని అనేక నెటిజన్లు వ్యాఖ్యానించారు.
అవును, ఈ లోకంలో మనకు రక్తసంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది.
మీరు పెద్దవారైనప్పుడు & మీ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లిపోయినప్పుడు, మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులవుతారు.
స్నేహితులు దూరంగా వెళ్లిపోవచ్చు, పిల్లలు పెరిగి ఎగిరి పోవచ్చు కానీ మీ పక్కన మీ జీవితభాగస్వామి తప్ప, మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయడానికి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మాత్రమే వుంటారు
మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఒకచోట చేరడం చాలా ఆనందంగా వుంటుంది
వారితో కలిసిమేలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెల్ల తో కరుణ మరియు దయతో ఉండండి.
గతంలో ఏది జరిగినప్పటికీ ఏది ఏమైనఅయినప్పటికీ, అన్నదమ్ములు అక్కాచెల్లెలళ్లు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి.
అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయలేని ముడి లేదు. తొలగించలేని కవచం లేదు.
ఎప్పుడూ పాత చేదు సంగతులజోలికి వెళ్లకూడదు లేదా పాత పగ ద్వేషం పెట్టుకోకూడదు. ఎక్కువగా పరస్పర ఆధారపడటం & పరస్పర ప్రేమతో, సంబంధాలు మెరుగవుతాయి* *ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు
సరిఅయిన గ్రహింపు తో సాగిపోదాము... కొన ఊపిరి ఉన్నంతవరకు.......
🙏🏻🙏🏻🙏🏻🙏🏻