HALF PAY LEAVES:-
●ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు13,18,23 నందు పొందుపరచారు.
●సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)
ఉదా: ఒక ఉద్యోగి 25.04.1990 న అపాయింట్ అయ్యి 31.12.2020 న రిటైర్ అవుతాడు అనుకుంటే అతని HPL ఖాతా లెక్కింపు విధానం..
25.04.1990 నుండి 24.04.2020 వరకు 30 ఏళ్ళ సర్వీసుకు 30*20=600 రోజులు జమ చేస్తారు.
25.04.2020 నుండి 31.12.2020 వరకు ఉన్న సర్వీస్ పీరియడ్ కు హాఫ్ పే లీవ్ ఏమి జమ కాదు.
కారణం: ఒక సం. సర్వీస్ కు కొన్ని రోజులు తక్కువైన ఈ సెలవు జమ కాదు
●ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.
EOL కి వెళ్లినా కూడా ఆ పీరియడ్ కి కూడా ఈ సెలవు మంజూరు చేస్తారు. అందుకే దీనిని "Un earned leave" అంటారు.
●అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట, జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.
అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు:-
1. వైద్య ధృవపత్రం ఆధారంగా (Medical Certificate)
2.స్వంత వ్యవహారాలపై (Private Affairs)
●సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును. ఇంక్రిమెంట్లు, సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.
●వైద్య కారణములపై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవుఅందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
{APLR 15(B) & 18(B}
●కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకుపెంచడమైనది.
(G.O.Ms.No.186 Dt:23-07-1975)
●సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు(Rule 15(B))
●240 రోజుల పూర్తి జీతం వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.
●వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.
●వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు
(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)
★అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడవు.
●క్యాన్సర్, మానసిక జబ్బులు, కుష్టు, క్షయ, గుండె జబ్బు,మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
(G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No.449 Dt:19-10-1976)
●వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు. (G.O.Ms.No.29 Dt:09-03-2011)
★ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)
●ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.
●సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)