Search This Blog

Tuesday, January 3, 2023

చదువుల తల్లి సావిత్రి బాయి పూలే..

చదువుల తల్లి సావిత్రి బాయి పూలే..
(నేడే సావిత్రి బాయి ఫూలే జయంతి)
సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఏ భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి, విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమని భావించిన పూలే దంపతులు బాలికలకోసం, శ్యూన, అతి ద్రుల కోసం పాఠశాలలను ప్రారంభించారు. బాలికలకు విద్యను అందించినందుడు వీరికి సమాజం నుంచి దారులు, విమర్శలే ఎదురయ్యాయి. జ్యోతి రావు పూలే తన భార్య సావిత్రి బాయికు చదువు నేర్పి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు. అగ్రకుల మహిళలడి కూడా చదువుకునే అవకాశం లేని రోజుల్లోనే సావిత్రి భాయి పూలే సమాజ కట్టుబాట్లను ఎదిరించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా, మొదటి శ్యూన్ మహిళా ఉపాధ్యాయునిగా బాలికలకు విద్యను అందించి చరిత్ర సృష్టిచింది, ఆడవాళ్ళు ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టేందుకు వీలులేని రోజుల్లో ఆమె పాఠాలు బోధించడానికి విద్యాలయానికి వెళ్ళేటపుడు అనరాని మాటలు అన్నారు. వినరాని తిట్లు తిట్టారు. ఆమెపై అగ్రకుల పురుష ప్రపంచం దాడి చేసింది. ఆమెపై బురద, రాళ్లు విసరడం. చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరల వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను' అని చెప్పేది. ఎన్ని అడ్డంకులు ఎదురయినా తన లక్ష్యం కోసం ముందుకు సాగింది. తన జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు ఇంకితమైంది. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసింది. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి పోరాటం చేసింది. ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో సయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం, సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరు కాపులు వీరికి చుట్టాలు. సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు పూలెను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు. "జ్యోతీరావు పూరి" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయునిగా రక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి నిమ్న కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద, గౌరవం వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన ఈ దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా 12 మీ 1848వ దేశంలో బహుజనులకు మెట్టమెదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించారు. దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి పాఠశాలలను ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 12 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులు గృహ బహిష్కారానికి గురి అయ్యారు. ఆమె మానవ హక్కులు గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. ఈ సంస్థ ప్రసమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య బాయి
వ్యవస్థల అణచివేతను వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రి భాయి పూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో "సత్యాన్ని" శోధించడానికి 1873లో తన భర్త మహత్మా జ్యోతి రావు పూరీతో కలసి "సత్యశోధక్ సమాజాను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, మరియు వితంతువు పునర్వివాహల కొరకు బ్రాహ్మణవ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్ద వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యత్నంగ్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలడు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న "సత్యర శోధక్ సమాజ్" అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్య శోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూటీ, ఈ సత్య శోధర్ సమా 'మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ " ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక వి యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్య శోధక్ సమాజ్ ఆధ్వర్యను సావిత్రీబాయి వివాహం జరిపించారు. నుంచి సావిత్రీబాయి 1868 అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం కరువు నాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాదు. రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి 'కావ్యపూలే'ను ప్రచురించింది. మరో కవితా సంపుటి 'పావన కాశీ సుభోధ్ రత్నాకరు 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి. జ్యోతీరావుపూలే 1890 నవంబరు 28వ మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. పూలే మరణాంతరం సత్యశోధక సమాజ భాధ్యతని స్వీకరించి నడిపించింది. 1897 లో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తో కల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది. సావిత్రం జయంతిని నేడు భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.





TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top