Search This Blog

Thursday, December 22, 2022

గణితశాస్త్రవేత్త శ్రీనివాస్‌ రామానుజన్‌ జయంతి సందర్భంగా

**ప్రతి ఒక్కరి గుండెల్లో  శ్రీనివాస రామానుజన్‌*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
 *22.12.2022
(నేడు గణితశాస్త్రవేత్త శ్రీనివాస్‌ రామానుజన్‌ జయంతి సందర్భంగా)

*గణితం ఒక జీవన విధానం*
గణిత ఘనుడు రామానుజన్ గురించి స్మరించుకుందాం

గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్‌
”ప్రముఖ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ 1887డిసెంబర్‌ 22న తమిళనాడులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కోమలతామ్మాల్‌, శ్రీనివాస్‌ అయ్యంగార్‌. వీరి తండ్రి ఒక బట్టల దుకాణంలో చిన్న గుమస్తా. ఇల్లు గడవ డమే కష్టంగా ఉండేది. రామానుజన్‌కి గణితమే సర్వస్వంగా ఉండేది. 

13 సం|| వయస్సులోనే రూపొందించిన ‘టెగ్రా మెట్ర్‌’ సమస్యలను పరిష్కరించాడు. 15 సంవత్సరాలప్పుడే జార్జ్‌ స్కూటో సిడ్జ్‌కార్‌ రూపొందించిన 6000 గణిత సిద్ధాం తాలను తులనాత్మకంగా పరిశీలించాడు. 1903లో మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో వీరికి ఉపకార వేతనం వచ్చింది. కాని లెక్కలలోనే 24 గంటలు గడపడం వల్ల పరీక్ష తప్పాడు. స్కాలర్‌షిప్‌ కూడా పోయింది. లెక్కలవల్ల పిచ్చిపడుతుందే మోనని తండ్రి భయపడి ఆయనకు పెళ్లి చేశాడు. సంసారం గడవడం కోసం నెలకు 25 రూపాయల వేతనం మీద గుమస్తాగా చేరాడు. 

చిత్తు కాగితాలను కూడా జాగ్రత్తగా వాడుకుంటూ గణితమే లోకంగా బ్రతికేవాడు. ఆయన గణితంలో ప్రదర్మిస్తున్న ప్రజ్ఞను చూసి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాస్‌ యూనివర్సిటీ నెలకు 75 రూపాయల ఫెలోషిప్‌ మంజూరు చేసింది. అప్పుడే రామానుజన్‌ 120 గణిత సిద్ధాంతాలను పొందుపరచి కేంబ్రిడ్జికి చెందిన గణిత శాస్త్రవేత్త అయిన జి.హెచ్‌. హార్డికి పంపాడు. హార్డీ ఆ పనితనాన్ని, అందులోని గొప్పదనాన్ని గ్రహించాడు. బ్రిటన్‌ రావలసిందిగా రామానుజన్‌ను కోరాడు. 

మార్చి 17, 1914న బ్రిటన్‌ బయలుదేరాడు. ఎముకలు కొరికే చలిలో ఈయన సంఖ్యలతో కుస్తీలు చేసేవారు. ఈయనలో గొప్ప గణితజ్ఞుడు దాగి ఉండడాన్ని హార్డీ గుర్తించగలిగాడు. ఫిబ్రవరి 28, 1918లో రామానుజన్‌ని ‘ఫెలో ఆఫ్‌ది రాయల్‌ సొసైట’ీగా ఎన్నుకున్నారు. ఇలా ఎన్నుకోబడ్డ భారతీయులలో ఈయన రెండవవాడు. ఇదే సంవత్సరం అక్టోబర్‌ నెలలో ఫెలో ఆఫ్‌ట్రినిటి కాలేజ్‌గా ఎన్నుకోబడ్డారు. ఈయన బీజ గణితంలో సాధించిన సమీకరణాల వల్ల యూలర్‌, ఔకోచి వంటి గొప్ప శాస్త్రవేత్తల కోవలోకి చేరాడని కేంబ్రిడ్జ్‌లో ఎంతో మంది చెప్పుకునేవారు. 

ఈ మేధావికి క్షయ వ్యాధి సోకింది. ఫలితంగా ఇంగ్లాండు నుండి స్వదేశానికి తిరిగి వచ్చి మృత్యువుతో పోరాడుతూ కూడా గణితంలో నిత్యం చిత్ర విచిత్రమైన అంశాలను అవిష్కరిం చాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతరం పరిశోధన వల్ల కలిగిన శ్రమ వలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల తీవ్రమైన శ్రమచేసి 32 పరిశోధన పత్రాలు సమర్పించాడు. శరీరం శుష్కించి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియచెప్పి ఆయన్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఈ సంఘటన గురించి హార్డీ ఇలా చెప్పారు. 

*నేను ఒకసారి రామానుజన్‌ను చూసేందుకు టాక్సీ లో వెళ్లాను. దాని నంబర్‌ 1729. ఈ నంబర్‌ చూడడానికి డల్‌గా కనిపి స్తుంది. ఇది చెడు కాదు కదా అని అన్నాను. అతడు కాదు, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరు-వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్య లలో ఇది ఒకటి. అందుకే వారి సంఖ్య 1729 గా చెప్ప వచ్చు. వీరు 1920 వ సంవత్సరం ఏప్రిల్‌ 26 న మరణించారు. వీరి చివరి దశలో మ్యాక్స్‌-లీటా ఫంక్షన్‌పై చేసిన పరిశోధనలు చరిత్రకెక్కాయి.*

గణితంలో వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. తెలంగాణా ప్రభుత్వం శ్రీనివాస రామా నుజన్‌ జయంతిని అధికారికంగా అన్ని విశ్వవిద్యాలయాలు పాఠశాలల్లో నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్ధులకు వారు చేసిన సేవలు వివరించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్తగా రామానుజన్‌ కీర్తి గడించారు. నేటితరం ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యా ర్ధులు రామానుజన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. గణితంపై పరిశోధనలు మరిన్ని జరగాలి. విద్యార్ధులలో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించాలి.

 నేను గణితాన్ని ప్రేమిస్తున్నాను, గణితంలో జీవిస్తాను అన్న భావన విశ్వవ్యాప్తం కావాలి. అందరం రామానుజన్‌ ఆడుగుజాడలల్లో నడుద్ధాం… 
గణితదేశం… భారతదేశం అన్న స్వప్నాన్ని అక్షరాలా నిజం చేయడానికి గణిత ఫోరం నడుం బిగించింది, పదండి ముందుకు పోదాం గణిత దారిలో.......🙏

 

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top