చక్కెరవ్యాధి అదుపులో ఉండాలంటే...
మధుమేహంతో బాధపడేవాళ్లు చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఈ నాలుగు రకాల దుంపలు తినడంవల్ల రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు.
మధుమేహంతో బాధపడేవాళ్లు చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఈ నాలుగు రకాల దుంపలు తినడంవల్ల రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు.
* పిండిపదార్థాలు తక్కువగానూ పీచు, నీటిశాతం ఎక్కువగానూ ఉండే టర్నిప్ (గుండ్రంగా ఉండే ముల్లంగి లాంటి దుంప)ను ఆహారంలో భాగంగా చేసుకుంటే చక్కెరశాతం పెరగకుండా ఉంటుంది.
* రక్తంలో గ్లూకోజ్ నిల్వలు మరీ ఎక్కువగా ఉన్నవాళ్లు ఆల్ఫా-లిపోయిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ను తింటే నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇవి కంటికీ మంచిదే. పోతే, ఈ దుంపల్లోని బెటాలెయిన్, నియో బెటానిన్‌లు ఇన్సులిన్ శాతాన్ని పెంచడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తాయి.
* గ్లూకోసైనోలేట్, ఐసోథియోసైనేట్‌లు ఎక్కువగా ఉన్న ముల్లంగిని ఆహారంలో భాగంగా తీసుకుంటే చక్కెర వ్యాధి అదుపులో ఉండటంతోపాటు ఇన్సులిన్ స్రావాన్ని పెంచే అడిపొనెక్టిన్ శాతం పెరిగేలా చేస్తుంది. విటమిన్-ఎ, పీచు అధికంగా ఉండే క్యారెట్ కూడా ఆ కాలంలో తింటే మంచిదే.