Search This Blog

Tuesday, November 8, 2022

మీకు క్రెడిట్‌ కార్డు ఉందా? ఇలాంటి చోట్ల అస్సలు వాడకండి.. భారీ నష్టం తప్పదు!



ప్రస్తుతం వీటి వాడకం బాగా పెరిగింది. గతంలో అయితే దీనిని స్టేటస్‌ సింబల్‌గా భావించిన రోజులు కూడా ఉన్నాయ. అయితే ఇప్పుడు మాత్రం బ్యాంకులు అందరికీ కార్డులు మంజూరు చేస్తున్నాయి. వినియోగదారులు కూడా గతంతో పోలిస్తే క్రెడిట్‌ కార్డు వాడకాన్ని బాగానే పెంచేశారు. అవసరాన్ని బట్టి వివిధ రకాల క్రెడిట్‌ కార్డులను కూడా బ్యాంకులు అందిస్తున్నాయి. ఫ్యూయల్‌ ఎక్కువగా వాడేవారికి అందుకు సంబంధించిన కార్డులు, ప్రయాణాలు చేసేవారికి ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు, షాపింగ్‌ చేసేవారికి లాభాలు చేకూరేలా కొన్ని కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే చాలా మంది అవగాహన లేకుండానే క్రెడిట్‌ కార్డు ఇస్తాం అనగానే తీసేసుకుంటున్నారు.

క్రెడిట్‌ కార్డ్‌ని ఎలా వాడాలి అని చాలా మందికి పూర్తిగా తెలియదు. ఇప్పుడు వాడుకుంటే 40 రోజుల తర్వాత బిల్లు కట్టాలి అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే కార్డు ఇచ్చే ఏజెంట్లు కూడా మీరు వడ్డీ లేకుండా 40 రోజులు డబ్బు వాడుకోవచ్చు.. డ్యూ డేట్‌ లోపు బిల్‌ కట్టేస్తే సరిపోతుంది అంటారు. అయితే క్రెడిట్‌ కార్డు వాడకంపై కొన్నిసార్లు ఇంట్రస్టు పడుతుంది. మీరు చేసే చెల్లింపులు, షాపింగ్‌లకు సంబంధించి జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్‌ కార్డు వినియోగం వల్ల మీకు తెలియకుండానే కొన్నిచోట్ల అధికంగా నష్టపోతూ ఉంటారు. మీరు కట్టాల్సిన మొత్తం కంటే అదనంగా నష్టపోతూ ఉంటారు. అయితే అసలు మీరు ఎలాంటి చోట్ల క్రెడిట్‌ కార్డుని వాడకుండా ఉంటే మంచిదో తెలుసుకోండి.

ఎక్కడ క్రెడిట్ కార్డు వాడకపోవడం మంచిదంటే:


  • ట్రైన్ టికెట్ల బుకింగ్ కోసం కూడా చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియకపోవచ్చు.. ఐఆర్ సీటీసీలో టికెట్లు బుక్ చేసే సమయంలో ఒకటి నుంచి రెండు శాతం వరకు సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. అందుకే ఇలాంటి చోట్ల క్రెడిట్ కార్డు వినియోగం తగ్గిస్తే మంచిదని చెబుతుంటారు.
  • సాధారణ క్రెడిట్ కార్డులను పెట్రోలు బంకుల్లో అస్సలు వాడకండి. ఎందుకంటే మీరు చేసే చెల్లింపుపై 1 శాతం సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. అలాగే మీరు 7.2 శాతం జీఎస్టీ కడా కట్టాలి. అయితే బ్యాంకులు కొన్నిసార్లు సర్వీస్ ఫీజును రిఫండ్ చేస్తుంటాయి. కానీ, జీఎస్పీ మాత్రం రిఫండ్ కాదు. మీరు తప్పకుండా చెల్లించాల్సిందే.
  • అందరూ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఒక్కటే కదా అనుకుంటూ ఉంటారు. దానితో కూడా ఏటీఎంలో డబ్బు తీసుకోవచ్చులే అనే భావనలో ఉంటారు. అయితే పొరపాటున కూడా ఏటీఎంలో క్రెడిట్ కార్డు పెట్టకండి. అలా మీరు డబ్బు తీస్తే సెక్యూరిటీ అడ్వాన్స్ పేరిటి వందల్లో వసూలు చేస్తారు.
  • క్రెడిట్ కార్డు నుంచి కొంతమంది అమౌంట్ ను పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ వంటి సైట్లకు బదిలీ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో 3 శాతం వరకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇంక ఒక కార్డు నుంచి మరో ఖాతాలోకి డబ్బు పంపడం, జీవిత బీమా వంటి వాటిని క్రెడిట్ కార్డులతో కట్టడం కూడా మంచిది కాదు. అలాంటి చాలా సందర్భాలు మీ సిబిల్ స్కోర్ ని కూడా ప్రభావితం చేస్తాయి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top