Yogasanas: యోగాతో సయాటికా నొప్పి దూరం
నడుంనొప్పితో నడుస్తున్నపుడు భరించలేనంత బాధ ఉంటుంది. కాలి పిక్కల నుంచి వెన్నులోకి నొప్పి పాకుతుంది. ఈ సమస్యను సయాటికా నొప్పి అంటారు.
నడుంనొప్పితో నడుస్తున్నపుడు భరించలేనంత బాధ ఉంటుంది. కాలి పిక్కల నుంచి నొప్పి వెన్నులోకి పాకుతుంది. ఈ సమస్యను సయాటికా నొప్పి అంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నడుంనొప్పి ఎంతకు తగ్గదు. అసలు ఆ బాధ అంతా ఇంతా కాదు. ఏ పని చేయాలన్నా.. చాలా అవస్థ పడాల్సిందే. సయాటికా నరం ఒత్తిడికి గురైనపుడు ఈ నొప్పి వేధిస్తుంది. దీనికి యోగాలో చక్కని నివారణ మార్గం ఉందని యోగా నిపుణుడు ఆర్‌ఆర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఏం చేయాలంటే...!
యోగాలో సయాటికా నొప్పి తగ్గించేందుకు కొన్ని ఆసనాలున్నాయి. ఇందులో ప్రధానంగా మార్జాలాసనం, వాయుముద్ర బాగా పని చేస్తాయి. వెన్నునొప్పి తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. వాయుముద్రలో శ్వాసను తీసుకుంటూ.. విడిచిపెట్టాలి. ఉదయం, సాయంత్రం 40 నిమిషాలు చేస్తే సయాటికా సమస్య తొలగిపోతుంది.