Happy Teacher's Day Quotes In Telugu
భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి గురువు. ‘ఆచార్యదేవోభవ’ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తాం. నిజం చెప్పుకోవాలంటే.. మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలివితేటలు, ఆలోచనల గురించి వారికి పూర్తిగా తెలుసు. ‘నీకు ఈ సబ్జెక్టుపై మంచి పట్టుంది. నువ్వు ఫలానా కోర్సు చెయ్యి నీ భవిష్యత్తు బాగుంటుంది’ అని వారే మనకు సూచిస్తుంటారు. మనల్ని మంచి దారిలో నడిపించే విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎప్పుడైనా చదువు మీద శ్రద్ధ తగ్గినట్టనిపించినా, మనసు పక్కదారి పట్టినట్టు గుర్తించినా దండిస్తారు. అలా దండించైనా సరే మళ్లీ మనల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనల్ని అత్యున్నత స్థానంలో చూడాలని ఉపాధ్యాయుడు కోరుకుంటారు. తన శిష్యుడు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి గర్వంతో ఉప్పొంగిపోతారు.
గౌరవనీయమైన వృత్తిలో ఉంటూ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతోన్న ఉపాధ్యాయులను గౌరవించేందుకే మనం ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది, భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా (Teacher’s day) జరుపుకుంటున్నాం. ఏటా సెప్టెంబర్ 5 (September 5) న దేశవ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకుంటాం. ఈ రోజు తమకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులను సత్కరిస్తూ వారిపై తమకున్న గౌరవాన్ని తెలియజేస్తుంటారు.
అయితే ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఏ చిన్న సందర్భం వచ్చినా దాని గురించి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెడుతున్నాం. టీచర్స్ డే రోజు కూడా ఉపాధ్యాయుడిపై తమకున్న భక్తిని, గౌరవాన్ని తెలియజేయడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాం. టీచర్స్ డే రోజు ఉపాధ్యాయుల విలువ చెప్పే కొటేషన్లు పోస్ట్ చేస్తుంటారు. కొందరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా తమ గురువుకు ధన్యవాదాలు చెబుతారు. దాని కోసమే ఈ టీచర్స్ డే కొటేషన్లు, టీచర్స్ డే మెసేజెస్.
Shutterstock
ఫేస్ బుక్ పోస్ట్ చేయదగిన టీచర్స్ డే కొటేషన్స్ (Happy Teacher’s Day Quotes In Telugu)
- ఉపాధ్యాయులు లేని జీవితం ఊహించలేనిది. వారి ప్రభావం అనునిత్యం మనపై కనిపిస్తూనే ఉంటుంది. వారు వెలిగించిన జ్ఞానమనే దీపం ఎప్పుడూ మనకు దారి చూపుతూనే ఉంటుంది. ఈ దీపం మరింత మందికి వెలుగు పంచాలని కోరుకుంటున్నాను.
- దారి చూపే జ్ఞాన దేవత. తండ్రి తర్వాత మరో రోల్ మోడల్. విద్యార్థి కష్టం తనదిగా భావించే గొప్ప మనిషి. విద్యార్థిని పైకి తీసుకొచ్చేందుకు 100కి 110 శాతం కష్టపడే వ్యక్తి ఉపాధ్యాయుడు.
- మంచి ఉపాధ్యాయుడు తన శిష్యులందరూ జ్ఞానవంతులయ్యేలా శ్రమించడంతో పాటు.. వారికేదైనా సమస్య వస్తే.. వారి వెన్నుతట్టి ముందుకు నడిపిస్తారు.
- మనమేంటో మనకే తెలియని క్షణంలోనూ మన భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది.
ఉపాధ్యాయుడికి ధన్యవాదాలు చెబుతూ పంపే మెసేజ్ లు (Thank You Teacher Messages)
- ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ టీచర్… ఈ నాలుగు కలసి ఒక్కటిగా మారితే అది మీరు. మీరు అందించిన సాయానికి నేనెప్పుడు కృతజ్ఞుడినై/కృతజ్ఞురాలినై ఉంటాను.
- నిస్వార్థమైన మీ మనసుకి, విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దాలనే మీ తపనకు సదా కృతజ్ఞులై ఉంటాం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
- ఉపాధ్యాయుడు నాటిన జ్ఞానమనే విత్తనాలు ఎన్నేళ్లయినా ఫలాలు ఇస్తూనే ఉంటాయి.
- విద్యార్థిలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి అందమైన జీవితానికి వెలుగు బాట చూపించేవాడే ఉపాధ్యాయుడు.
- ‘చిన్న విజయానికే సంతృప్తి పడిపోవద్దు. నువ్వు సాధించాల్సిన లక్ష్యం చాలా పెద్దది.’ ఉపాధ్యాయుడు చెప్పే ఈ మాట మనల్ని ఎప్పుడూ ఉన్నత లక్ష్యాల దిశగా నడిపిస్తుంది.
- ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమమైన దారి చూపిస్తారు. ఆ దారిలో తన శిష్యులను నడిపించడం కోసం తిడతారు. మరీ మొండికేస్తే కొడతారు. అది తన దగ్గర చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసమే.
- గురువు అనే వ్యక్తే లేకపోతే.. ఈ ప్రపంచం అంతా అంధకారంలోనే మునిగిపోయి ఉండేదేమో. జ్ఞానమనే జ్యోతిని వెలిగించి ఈ ప్రపంచానికి వెలుగు ప్రసాదించింది ఉపాధ్యాయుడే. అలాంటి గొప్ప గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
- మీరు పాఠం చెప్పే విధానం, విద్యార్థులకు పంచే జ్ఞానం, వారిపై మీరు కనబరిచే శ్రద్ధ, కురిపించే ప్రేమ అన్నీ కలసి మిమ్మల్ని బెస్ట్ టీచర్ అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. హ్యాపీ టీచర్స్ డే.
ఉపాధ్యాయుల విలువను చెప్పే కొటేషన్లు (Teachers Day Messages)
Shutterstock
వాట్సాప్ స్టేటస్ గా టీచర్స్ డే శుభాకాంక్షలు (Teachers Day Wishes)
Shutterstock