Search This Blog

Saturday, September 17, 2022

ప్రతిజ్ఞని పాటిద్దాం!

ప్రతిజ్ఞని పాటిద్దాం!


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజల్లో చైతన్యం కల్గించిన గీతాల్లో ప్రతిజ్ఞ ఒకటి.
భారత దేశం-నా మాతృభూమి ప్రతిజ్ఞ రచయిత పేరు తెలియకుండానే దాదాపు యాభై ఏండ్లు పాఠశాలల్లో ప్రతిజ్ఞనిఆలపించాం.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటంలా పైడిమర్రి వెలుగులోకి వచ్చారు.భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని పాటిస్తున్న భారతీయులకు ముందు ముందు స్వార్ధపూరిత శక్తులతో  ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1962లో ప్రతిజ్ఞ రాశారు. జాతీయ గీతాన్ని మరియు జాతీయ గేయాన్ని రాగయుక్తంగా ఆలపిస్తాం. వీటిని పాడటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.వీటిని రచించిన రచయితలకు కూడా చరిత్రలో సముచిత స్థానం లభించింది. కానీ జాతీయ జెండాను రూపొందించిన పింగళివెంకయ్యకుగానీ,జాతీయ ప్రతిజ్ఞని రాసిన పైడిమర్రికి గానీ చరిత్రలో సరైన స్థానం కల్పించబడలేదు. వీరికి వ్యక్తిగత స్వార్ధం లేకపోవడం,తాము చేసిన గొప్ప కార్యక్రమాలకు సరైన రికార్డులు లేకపోవడం వంటి కారణాల వల్ల భావి తరాలు వీరిని మర్చిపోయే ప్రమాదం ఉంది.నల్గొండ జిల్లాకు చెందిన ఎలికట్టె శంకర్రావు 2011లో పైడిమర్రి గురించి ఓ వ్యాసం రాశారు.

పైడిమర్రి గొప్ప దేశభక్తుడు.మంచి రచయిత. నీతి, నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి.గొప్ప వైద్యుడు.మంచి మానవతావాది.1916 జూన్ 10న నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు.1962 సెప్టెంబర్17న విశాఖపట్నం లో జిల్లా ఖజానాధికారిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ రాశారు.ఆయన ప్రతిజ్ఞ తో కాల భైరవుడు వంటి పలు రచనలు చేశారు.1965నుండి దేశ వ్యాప్తంగా విద్యార్థుల చేత ప్రతిఙ్ఞ ఆలపించబడుతుంది.2016లో పైడిమర్రి శత జయంతి ఉత్సవాలు జరిగాయి.ఆయన చేసిన సేవలకు ఎటువంటి పురస్కారాలు దక్కలేదు. జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు చేసిన కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం లో ఆయన జీవిత వివరాలని పొందుపర్చింది.

పైడిమర్రి జీవిత చరిత్రను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో వి.జి.ఎస్ ప్రచురణ సంస్థ ముద్రించి పుస్తక రూపంలోకి తెచ్చింది.
పైడిమర్రి పేరుతో ఎక్కడా నిలువెత్తు విగ్రహాలు లేవు.ఇప్పటికీ చాలా మందికి ఆయన పేరు తెలియదు.2015లో రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞ వద్ద ఆయన పేరుని ముద్రిస్తున్నారు.ఎన్. టి.ర్ జిల్లా, తిరువూరు మండలంలో,మల్లేల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూన్ 18న దేశంలోనే తొలి నిలువెత్తు పైడిమర్రి విగ్రహాన్ని  ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరణ చేశారు. ఇదొక మంచి పరిణామం.దేశంలోని ప్రజలంతా కుల, మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో  పైడిమర్రి ప్రతిజ్ఞ  ప్రతిఙ్ఞ రాశారు. ప్రతిజ్ఞ అంటే ఒక హామీ.అంటే ఇచ్చిన మాటనునిలబెట్టుకోవడం.విద్యాలయాల్లో ప్రతిజ్ఞని మొక్కుబడిగా కాకుండా, చిత్తశుద్ధితో విద్యార్థులు ఆలపించేలా ఉపాధ్యాయులు చూడాలి.ప్రతిజ్ఞ పదాలని అచరించేలా చూడాలి.



యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836
ప్రతిజ్ఞ ప్రచారకర్త

సెప్టెంబర్ 17 ప్రతిజ్ఞ ఆవిర్భావ దినోత్సవం




TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top