TSPSC Jobs: తెలంగాణ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రజారోగ్య ప్రయోగశాలలో 24 ఫుడ్‌సేఫ్టీ అధికారుల నియామకానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ప్రకటన జారీ చేసింది.
వివరాలు:
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 24 పోస్టులు
అర్హతలు: బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ). లేదా మాస్టర్స్ డిగ్రీ(కెమిస్ట్రీ) లేదా డిగ్రీ(మెడిసిన్) ఉత్తీర్ణత.
వయస్సు: 01-07-2022 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: రూ.42300 - 115270.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.280.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 29-07-2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26-08-2022.
పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) తేది: నవంబర్, 2022.