మూత్రపిండాల్లో రాళ్లను నివారించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆక్సలేట్, కాల్షియం వంటి స్ఫటికాలు.
Diet In Kidney Stone: ప్రస్తుత కాలంలో కిడ్నీల్లో రాళ్ల సమస్య సర్వసాధారణమైపోయింది. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారంలోని కొన్ని రసయనాలు మన కడుపులో పేరుకుపోవడం ద్వారా రాళ్లు వస్తాయి. చిన్న చిన్న రాళ్లు.. ఒక్కోసారి పెద్దవిగా మారుతాయి. కావున మూత్రపిండాల్లో రాళ్లను నివారించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆక్సలేట్, కాల్షియం వంటి స్ఫటికాలు మన కడుపులో నిక్షిప్తమైనప్పుడు, ముద్దలాంటి పదార్థం ఏర్పడటం ప్రారంభమవుతుంది. రాయిలా గట్టిగా ఉంటుంది. అందుకే దీనిని స్టోన్ అంటారు. కిడ్నీల్లో స్టోన్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆహారం గురించి తెలుసుకోండి..
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఇలా చేయండి..
- రాళ్లు రాకుండా ఉండాలంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. రోజంతా కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.
- మీకు కిడ్నీలో రాయి ఉంటే, అది పెరగకుండా నిరోధించడానికి అధిక ఫైబర్ ఆహారాలు తినాలి. ఇవి రాయి పెరగకుండా నిరోధిస్తాయి.
- కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి మొదలైన పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. సిట్రిక్ యాసిడ్ కాల్షియం-ఆక్సలేట్ పేరుకుపోకుండా నిరోధించే శక్తిని కలిగి ఉంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను నివారిస్తుంది.
- కొబ్బరి నీళ్లలో పీచు మంచి మోతాదులో లభిస్తుంది. ఇది రాళ్లు ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- పప్పుదినుసులతో కూడిన కూరగాయలు తినడం కూడా మంచిది.
- బేల్ పండ్లు, బేల్ ఆకులు, క్యారెట్లు, దుంపలు వంటి మూలికలు రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. మీరు వాటి టీ లేదా కషాయాలను తాగవచ్చు.
- చెరకు రసం మూత్రపిండాల్లో రాళ్లను కూడా నివారిస్తుంది. ఇది రాళ్ల సమస్యలు ఉన్న వారికి మేలు చేస్తుంది.
ఎలాంటి పదార్థాలు తినకూడదు..
- రాళ్లను నివారించడానికి లేదా పెరగకుండా నిరోధించడానికి ఆక్సలేట్, సోడియం, కాల్షియం లేనటువంటి ఆహారాన్ని తినాలి.
- టమోటాలు, యాపిల్స్, బచ్చలికూర వంటి అధిక ఆక్సలేట్ పండ్లు, కూరగాయలను నివారించండి.
- తృణధాన్యాలు, గింజలను నివారించాలి. ఇవి రాళ్లు పెరగడానికి దారితీస్తాయి.
- గుడ్లు, మాంసం, చేపలకు దూరంగా ఉండాలి.
- పాలతో చేసిన వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పెరుగు, వెన్న వంటి వాటిని తక్కువగా తినాలి.
- ముల్లంగి, క్యారెట్, వెల్లుల్లి, ఉల్లిపాయలలో సోడియం, ఆక్సలేట్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లు ఉంటే వీటిని తినకుండా ఉండండి.
- కిడ్నీల్లో రాళ్లు ఉంటే మద్యం అస్సలు తాగకూడదు.